Venu Swamy Comments On Ys Jagan: ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి 2026లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ జాతకంలో రాహువు ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల, ఎంత నెగటివ్‌గా ప్రచారం చేసినా ఆయనకు అంత పాజిటివ్ అవుతుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలపై, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కేసీఆర్, జగన్ ల మధ్య ఉన్న సంబంధాలపై ఆయన కీలక విశ్లేషణ చేశారు.
హైలైట్:
- జగన్ జాతకంపై వేణు స్వామి వ్యాఖ్యలు
- జగన్‌కు రాహువు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు
- ఎంత నెగిటివ్ చేస్తే అంత పాజిటివ్ ఉంటది

‘నేను అంత కాన్ఫిడెన్స్‌గా ఎందుకు మాట్లాడుతున్నానంటే.. వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో ఓడిపోయాడు.. ఓడిపోయిన తర్వాత జగన్ రోడ్డుపైకి వస్తే వేలాదిమంది ప్రజలు ఎందుకు వస్తున్నారు. ఎందుకంటే రాహువు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు. అలాడే ప్రభాస్ ఉన్నాడు.. అంతమంది హీరోల్లో ప్రభాస్ ఎందుకు తోపు.. రాహువు పదో ఇంట్లో ఉన్నాడు. ఎంత జరిగినా.. జాతకంలో ఉండే గ్రహాలు మనల్ని కంట్రోల్ చేస్తాయి, మనల్ని కాపాడతాయి. మనల్ని నెగిటివ్‌గా ట్రోల్ చేసినా పాజిటివ్ అవుతుంది. పోర్న్ స్టార్ సన్నీ లియోన్ చీర కట్టుకుని హైదరాబాద్ రెస్టారెంట్ ఓపెనింగ్‌కు వస్తే వేలమంది జనాలు చూడటానికి నిలబడ్డారు. ఆమెకు ఉండే క్రేజ్ ఆమెకు ఉంటుంది.. పోర్న్ స్టార్ అని ఆమెను ఎవరూ తిట్టలేదు కదా. రాహువు ఎవరి జాతకంలో అయితే ఉచ్చ స్థితిలో ఉంటాడో.. వారికి ఎంత నెగిటివ్ జరిగితే.. వాళ్ల జీవితం అంత పాజిటివ్‌గా ఉంటుంది. అలాంటి నమ్మకం ఉన్న వ్యక్తిగా.. నేను వ్యక్తిగా ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయను. ఈ సంవత్సరంలో చాలామందికి సమస్యలు ఉంటాయి.. ఈ ఏడాది జనాల్లో ఓ రకమైన సైకో ఇజం చూడబోతున్నాము’ అని చెప్పుకొచ్చారు
‘కాంగ్రెస్ పార్టీ టీడీపీకి ఒకరంటే, మరొకరికి పడదు.. అయితే తెలంగాణలో తెలుగు దేశం రూలింగ్ అని జనాలు అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ ఒకటే.. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేనలు ఒకటే కూటమి. తెలుగు రాష్ట్రాల్లో ఒక రూల్ ఉంది.. చంద్రబాబును ఇష్టపడితే, రేవంత్ రెడ్డిని ఇష్టపడాలి. కేసీఆర్‌ను ద్వేషిస్తే.. జగన్‌ను ద్వేషించాలి. ఈ ఇద్దరిలో ఒకరిని ప్రేమించడానికి హక్కు లేదు.. జగన్‌కు శత్రువు అయితే, కేసీఆర్‌కు శత్రువు అవ్వాలి. జగన్, కేసీఆర్ ఒకవైపు.. మిగిలిన పార్టీలు మరో వైపు. రాజకీయ వ్యూహాల పరంగా.. జనాలు చూసే విధానాన్ని చెబుతున్నాను.. నా సొంత కవిత్వం కాదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి అలా ఉంది.. వీళ్లకు సమస్యలు వస్తే ఒకర్ని మరొకరు కాపాడుకుంటారు. నాలాగా తటస్థంగా ఉంటే బకరాలు అవుతారు.. నాపై తప్పుడు ప్రచారం చేసినా ఇబ్బంది లేదు. నా స్థానంలో ఇంకొకరు ఉండుంటే.. చనిపోయి ఏడాది అయ్యేది’ అని చెప్పుకొచ్చారు.


