Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్.. సచిన్, లారాను మించిపోయేటోళ్లు భయ్యో..!

7 February 2026

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. అది ఎక్స్ రేటేడ్ అంటూ డిమాండ్..

7 February 2026

తెలుగులో తోప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
తాజా వార్తలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

.By .17 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


దిన ఫలాలు (జనవరి 17, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో కొద్దిగా పని భారం పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ బాధ్యతల్లో కొద్దిగా శ్రమ, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అయితే, ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా కష్టనష్టాల నుంచి బయటపడతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కాలక్షేపం చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చర్యలు చేపట్టడం చాలా మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రోజంతా చాలావరకు బాగానే గడిచిపోతుంది. అయితే, ఉద్యోగంలో కొద్దిగా పని భారం పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బాధ్యతలను, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల ఇరకాటంలో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆశించిన వ్యవహార జయం ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గురు బలం బాగా అనుకూలంగా ఉంది. ఫలితంగా ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు పర వాలేదనిపిస్తాయి. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. ఎవరితోనైనా కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు బాగాపెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొద్దిపాటి ధన యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు బాగా కలిసి వస్తాయి. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సప్తమ శని కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రయా ణాలను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశకావేషాలకు ఇది సమయం కాదు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. మొండి బాకీలు, బకాయిలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా మీ మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

చతుర్ధ రాహువు కారణంగా ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట ఉంటాయి. ఉద్యోగ బాధ్యతల్ని సంతృప్తికరంగా నెరవేరుస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి, వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సాయం చేయడం జరుగు తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ప్రస్తుతం ధన స్థానం ముఖ్యమైన గ్రహాలతో బాగా బలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. మధ్యవర్తుల జోక్యంతో స్థిరాస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమవుతుంది. ఇతరులకు సాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ సలహాలకు, సూచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. బాధ్యతల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

గురు బలం వల్ల ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగుల ప్రతిభకు, శ్రమకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నత ఫలితాలను పొందుతారు. శుభ కార్యాలకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ, వాహన కొనుగోలు ప్రయత్నాలు పురోగతి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. కుటుంబ విషయాలు, సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

లాభ స్థానంలో శుక్ర, రవుల బలం వల్ల రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం జరుగుతుంది. వ్యాపారులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రతిఫలం లభిస్తుంది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్.. సచిన్, లారాను మించిపోయేటోళ్లు భయ్యో..!

7 February 2026

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. అది ఎక్స్ రేటేడ్ అంటూ డిమాండ్..

7 February 2026

తెలుగులో తోప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..

7 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్.. సచిన్, లారాను మించిపోయేటోళ్లు భయ్యో..!

7 February 2026

Future Stars in Cricket: 2026 టీ20 ప్రపంచ కప్ శనివారం నుంచి మొదలైంది. ప్రతీ ఎడిషన్ లాగే, ప్రపంచవ్యాప్తంగా…

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. అది ఎక్స్ రేటేడ్ అంటూ డిమాండ్..

7 February 2026

తెలుగులో తోప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..

7 February 2026

Andhra Pradesh: ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు.. కాలేజీ గేట్లు క్లోజ్.. అసలేం జరిగిందంటే?

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్.. సచిన్, లారాను మించిపోయేటోళ్లు భయ్యో..!

7 February 2026

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. అది ఎక్స్ రేటేడ్ అంటూ డిమాండ్..

7 February 2026

తెలుగులో తోప్ హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.