Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra Pradesh: ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు.. కాలేజీ గేట్లు క్లోజ్.. అసలేం జరిగిందంటే?

7 February 2026

ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా..

7 February 2026

మహా శివరాత్రి ఎప్పుడు? ఫిబ్రవరి 15 లేదా 16.. ఈ గందరగోళానికి చెక్ పెట్టిన జ్యోతిష్యులు?

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»World Record : భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్.. ప్రపంచంలోనే మొదటి బ్యాటర్ గా రికార్డ్!
తాజా వార్తలు

World Record : భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్.. ప్రపంచంలోనే మొదటి బ్యాటర్ గా రికార్డ్!

.By .18 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
World Record : భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్.. ప్రపంచంలోనే మొదటి బ్యాటర్ గా రికార్డ్!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


World Record : భారత దేశంలో టీమిండియా పై వన్డేల్లో ఆడుతున్నప్పుడు ఏ బ్యాటర్ కైనా ఒత్తిడి ఉంటుంది. కానీ డారిల్ మిచెల్ మాత్రం ఇక్కడ ఆడుతుంటే తన సొంత ఊరిలో గల్లీ క్రికెట్ ఆడుతున్నంత ఈజీగా రెచ్చిపోతున్నాడు. ఇండోర్ వన్డేలో సెంచరీ పూర్తి చేసిన మిచెల్.. భారత దేశంలో టీమ్ ఇండియాపై వరుసగా ఐదు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 50కి పైగా పరుగులు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ అరుదైన ఘనత ఇప్పటివరకు క్రికెట్ దిగ్గజాలుగా పేరున్న సచిన్, కోహ్లీ లాంటి వారు ఆడే వేదికలపై ఏ విదేశీ బ్యాటర్ కు కూడా సాధ్యపడలేదు. మిచెల్ పరుగుల దాహం 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి మొదలైంది. అప్పుడు లీగ్ మ్యాచ్‌లో భారత్‌పై 130 పరుగులు చేసిన మిచెల్, వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీఫైనల్‌లో కూడా 134 పరుగులతో విరుచుకుపడ్డాడు. ఇక ప్రస్తుత సిరీస్‌లో కూడా అదే భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వడోదరలో జరిగిన తొలి వన్డేలో 84 పరుగులు, రెండో వన్డేలో అజేయంగా 131 పరుగులు, ఇప్పుడు ఇండోర్‌లో కూడా 106 బంతుల్లో సెంచరీ బాది తన రికార్డును పదిలం చేసుకున్నాడు. వరుసగా 130, 134, 84, 131, 100+.. ఇవీ భారత గడ్డపై మిచెల్ చివరి ఐదు ఇన్నింగ్స్‌ల గణాంకాలు.. ఇదొక నమ్మశక్యం కాని రికార్డు.

న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ 2014లో భారత్‌పై వరుసగా ఐదు 50+ స్కోర్లు చేసినప్పటికీ, అవి వేర్వేరు దేశాల్లో జరిగాయి. కానీ భారత్‌లోనే.. భారత బౌలర్లపై వరుసగా ఐదుసార్లు 50 మార్కును దాటిన రికార్డు మాత్రం కేవలం మిచెల్‌కు మాత్రమే దక్కింది. ఓవరాల్‌గా భారత్‌తో జరిగిన చివరి ఏడు వన్డేల్లో మిచెల్ ఏకంగా మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు సాధించడం అతని క్లాస్ బ్యాటింగుకు నిదర్శనం. స్పిన్నర్లను స్వీప్ షాట్లతో భయపెట్టడం, పేసర్లను స్టేడియం వెలుపలికి పంపడం మిచెల్‌కు అలవాటుగా మారిపోయింది.

వచ్చే టీ20 వరల్డ్ కప్ 2026కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో, మిచెల్ ఇలాంటి ఫామ్‌లో ఉండటం భారత మేనేజ్‌మెంట్‌కు పెద్ద ఆందోళనే. పీడకలలా వెంటాడుతున్న మిచెల్ వికెట్ తీయడం భారత బౌలర్లకు ఒక అగ్ని పరీక్షలా మారింది. మిచెల్ ఇన్నింగ్స్ వల్ల కివీస్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా కొండలా నిలబడి ఆదుకుంటున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే.. మిచెల్ ఇప్పుడు కివీస్ జట్టుకు ఒక సూపర్ హీరోలా మారి, భారత బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మహా శివరాత్రి ఎప్పుడు? ఫిబ్రవరి 15 లేదా 16.. ఈ గందరగోళానికి చెక్ పెట్టిన జ్యోతిష్యులు?

7 February 2026

Family Planning: అగ్గిపుల్ల లాంటి ఈ చిన్న కర్రతో 3 ఏళ్ల పాటు గర్భానికి చెక్! సరికొత్త టెక్నాలజీ చూశారా?

7 February 2026

Rose Day: వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది.. ఏ కలర్ గులాబీ ఎవరికి ఇవ్వాలో తెలుసా..?

7 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss

Andhra Pradesh: ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు.. కాలేజీ గేట్లు క్లోజ్.. అసలేం జరిగిందంటే?

7 February 2026

గుంటూరు మెడికల్ కాలేజీలో మెడికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ నెల 4న మంత్రి సత్యకుమార్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు.…

ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా..

7 February 2026

మహా శివరాత్రి ఎప్పుడు? ఫిబ్రవరి 15 లేదా 16.. ఈ గందరగోళానికి చెక్ పెట్టిన జ్యోతిష్యులు?

7 February 2026

Family Planning: అగ్గిపుల్ల లాంటి ఈ చిన్న కర్రతో 3 ఏళ్ల పాటు గర్భానికి చెక్! సరికొత్త టెక్నాలజీ చూశారా?

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Andhra Pradesh: ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు.. కాలేజీ గేట్లు క్లోజ్.. అసలేం జరిగిందంటే?

7 February 2026

ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా..

7 February 2026

మహా శివరాత్రి ఎప్పుడు? ఫిబ్రవరి 15 లేదా 16.. ఈ గందరగోళానికి చెక్ పెట్టిన జ్యోతిష్యులు?

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.