ఏపీ పాలనలో భాగంగా పవర్‌స్టార్ ప్రతి రోజూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. ఎక్కడో ఓ చోట ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు.
అయితే అదంతా ఇవ్వని కిక్.. ఇప్పుడు ఒక్క ఫొటో ఇస్తోంది పవన్ ఆర్మీకి. త్వరగా వచ్చేయండి బాస్ అంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
ఆ మధ్య మేనల్లుడితో కలిసి బ్రో మూవీతో పలకరించారు పవర్ స్టార్. ఆ తర్వాత ఆయన పూర్తిగా ప్రజల్లోనే ఉన్నారు. మేకప్ వేసుకునే సమయం లేకపోయింది.
ఇన్నాళ్లకు మళ్లీ సెట్లోకి అడుగుపెట్టడానికి కాల్షీట్లు సర్దుతున్నారు. హరిహరవీరమల్లు టీమ్ లేటెస్ట్ గా పవర్‌స్టార్‌ని కలిసింది. తుఫాను ముందు ప్రశాంతత అంటూ ఆ పిక్స్ ని రిలీజ్ చేసింది.
అతి త్వరలోనే షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని చెప్పేశారు మేకర్స్. ఆల్రెడీ విజయవాడలో హరిహరవీరమల్లు సినిమా కోసం సెట్స్ వేశారు. అక్కడే భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దాదాపు 400 – 500 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులతో అత్యంత భారీగా తెరకెక్కే దృశ్యాలు ఫ్యాన్స్ కి కన్నుల పండువగా మారనున్నాయి. పవన్ కల్యాణ్ ఈ సినిమాలో శక్తిమంతమైన యోధుడిగా కనిపిస్తారు.
ఈ సినిమా తర్వాత ఓజీ గురించి ఆలోచించడానికి సిద్ధమవుతున్నారు పవర్‌స్టార్. ముందంటూ ఒకటి మొదలైతే, ఆ వెనకే అన్నీ గాడిలో పడతాయని హ్యాపీగా కనిపిస్తున్నారు ఫ్యాన్స్.








