Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

T20 World Cup: అప్పుడు ఆసీస్, ఇప్పుడు కివీస్.. గంభీర్ ప్లానింగ్ మాములుగా లేదుగా.. ఈసారి కప్పు కొట్టేది మనమే

7 March 2026

ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలు తప్పక తినండి..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే…

7 March 2026

తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా.. తిండి కాదు.. అసలు నిజాలు తెలిస్తే షాకే..

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Mla Bandaru Sravani Sree Occult Worship,టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఇంటి దగ్గర కలకలం.. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి, పట్టుకునే లోపే! – occult worship in front of the house of tdp singanamala mla bandaru sravani sree in anantapur
ఆంధ్రప్రదేశ్

Mla Bandaru Sravani Sree Occult Worship,టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఇంటి దగ్గర కలకలం.. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి, పట్టుకునే లోపే! – occult worship in front of the house of tdp singanamala mla bandaru sravani sree in anantapur

.By .7 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Mla Bandaru Sravani Sree Occult Worship,టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఇంటి దగ్గర కలకలం.. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి, పట్టుకునే లోపే! – occult worship in front of the house of tdp singanamala mla bandaru sravani sree in anantapur
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tdp Singanamala Mla Bandaru Sravani Sree Occult Worship: టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఇంటి ముందు క్షుద్రపూజలు వ్యవహారం సంచలనంగా మారింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ముందు నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి పారిపోయారు. ఎమ్మెల్యే అనుచరులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా దొరకలేదు. ఎమ్మెల్యే వర్గీయుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల్ని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.

Tdp Mla Bandaru Sravani
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రీవాణిశ్రీ(ఫోటోలు– Samayam Telugu)
టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఇంటి ముందు క్షుద్రపూజలు చేయడం కలకలం రేపింది. శుక్రవారం రోజు అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేశారు. ఇద్దరు వ్యక్తులు కారులో అనంతపురంలోని ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వచ్చారు.. అక్కడ ఆగి నిమ్మకాయలు, తెల్ల నువ్వుల్ని ఇంటి ముందు పడేసి కారులో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించి ఎమ్మెల్యే అనుచరులు.. వెంటనే మరో కారులో వారిని వెంబడించారు.. కానీ వారు కారులో వేగంగా వెళ్లిపోవడంతో దొరకలేదు. దుండగులు వచ్చిన కారు నంబరు AP 39 KX 0986గా గుర్తించారు. ఆ కారు గురించి ఆరా తీయగా గుంటూరుకు చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ పేరుతో రిజిస్టర్ అయ్యిందని గుర్తించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే శ్రావణి నివాసం ఉండే ప్రాంతంలో కొంత కాలంగా ఇలా క్షుద్రపూజలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇలా క్షుద్రపూజలు ఎవరు చేయిస్తున్నారనే దిశగా ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యే శ్రావణితో విభేదించేవారు ఎవరైనా ఇలా చేస్తున్నారా అని అనుమానిస్తున్నారు. ఇవాళ ఇలా ఇంటి ముందు నిమ్మకాయలు, తెల్ల నువ్వులు వేయడంపై మరోసారి హాట్‌‌టాపిక్ అయ్యింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే వర్గీయులు అనంతపురం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దుండగుల్ని పట్టుకోవాలని కోరారు. అయితే పోలీసులు దుండగులు వచ్చిన కారు నంబరు, ఎమ్మెల్యే ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే శ్రావాణి పుట్లూరు మండలం పుట్లూరు చెరువు నుంచి కోమటికుంట్ల చెరువుకు నీటిని విడుదల చేశారు.
అనంతరం గంగమ్మకు పూజలు నిర్వహించి చీర, పసుపు, కుంకుమలను సమర్పించారు. గత నెల 14వ తేదీన సుబ్బరాయ సాగర్ నుంచి పుట్లూరు చెరువుకు నీటిని విడుదల చేయగా.. ప్రస్తుతం పుట్లూరు చెరువులో నీటిమట్టం సుమారు నాలుగు అడుగులుగా ఉంది. పుట్లూరు చెరువుకు మొత్తం 2025 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోమటికుంట్ల చెరువుకు 870 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సుబ్బరాయ సాగర్‌లో ప్రస్తుతం లైవ్ స్టాక్ 870 క్యూసెక్కులుగా ఉంది. సుబ్బరాయ సాగర్‌కు ఇన్‌ఫ్లో 175 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 140 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఈ నీటి నిర్వహణ ఏర్పాట్ల ద్వారా కోమటికుంట్ల చెరువుకు దాదాపు ఎనిమిది రోజుల పాటు నిరంతరంగా నీరు అందించనున్నారు. రానున్న రోజుల్లో 5.2 కోట్ల రూపాయలతో ఆధునికరణ పనులు పూర్తవుతాయి అంటున్నారు ఎమ్మెల్యే శ్రావణి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన చేస్తున్నారన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి