Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vijay: హీరో విజయ్ ను టార్గెట్ చేసిన కోలీవుడ్ ప్రముఖులు

7 March 2026

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలు..

7 March 2026

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. కివీస్ గండాన్ని దాటేసి.. 5 శాపాలను చెరిపేయనున్న టీమిండియా

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chittoor 37 Years Woman And 17 Years Boy Incident,ఆమెకు 37, అతడికి 17 ఏళ్లు.. ఇద్దరూ కలిసి పెద్ద స్కెచ్ వేశారు.. అసలు ట్విస్ట్ అదే! – minor boy attacks woman with knife in chittoor district
ఆంధ్రప్రదేశ్

Chittoor 37 Years Woman And 17 Years Boy Incident,ఆమెకు 37, అతడికి 17 ఏళ్లు.. ఇద్దరూ కలిసి పెద్ద స్కెచ్ వేశారు.. అసలు ట్విస్ట్ అదే! – minor boy attacks woman with knife in chittoor district

.By .7 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chittoor 37 Years Woman And 17 Years Boy Incident,ఆమెకు 37, అతడికి 17 ఏళ్లు.. ఇద్దరూ కలిసి పెద్ద స్కెచ్ వేశారు.. అసలు ట్విస్ట్ అదే! – minor boy attacks woman with knife in chittoor district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Chittoor District Woman And Boy Incident: చిత్తూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన సమాజాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న వివాహేతర సంబంధాల హత్యోదంతాలకు ఉదాహరణగా మారింది. ఆమెకు 37 ఏళ్లు. అతడికి 17 ఏళ్లు.. ఆ వివాహిత తన పిల్లల వయసుకు అటూ ఇటుగా ఉన్న 17 ఏళ్ల కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అడ్డుగా ఉన్న భర్త, అత్తను చంపేయాలని ఆమె ఆ బాలుడితో కలిసి స్కెచ్ వేసింది.

హైలైట్:

  • చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన ఘటన
  • 17 ఏళ్ల బాలుడితో 37 ఏళ్ల మహిళ ఎఫైర్
  • భర్త, అత్తను చంపేందుకు ప్లానింగ్
Chittoor Boy Attack On Woman
చిత్తూరు మహిళ బాలుడు ఘటన(ఫోటోలు– Samayam Telugu)
ఆమెకు 37 ఏళ్లు, అతడికి 17 ఏళ్లు.. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అక్కడితో ఆగకుండా 20 ఏళ్లు చిన్నవాడైన ఆ కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారని ఆ వివాహిత భావించింది.. ఇద్దరిని అడ్డు తొలగించుకుంటే ఇబ్బంది లేకుండా పోతుందని ప్లాన్ చేసింది. ఆ కుర్రాడికి చెప్పి భర్తతో పాటుగా అత్తను హత్య చేయాలని రెచ్చగొట్టింది. ఆ కుర్రాడు కూడా కత్తితో వివాహిత అత్తను చంపేందుకు వెళ్లాడు.. ఆమెపై దాడి చేశాడు. ఇంతలో చుట్టుపక్కల వారు రావడంతో ప్లాన్ బెడిసికొట్టి అతడు దొరికిపోయాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది. చిత్తూరు జిల్లా చామంతిపురానికి చెందిన కవిత వయస్సు 37 ఏళ్లు.. ఆమెకు 17 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు 14, 15 ఏళ్లు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కవితకు అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే కవిత ఘనకార్యం గురించి తెలుసుకున్న భర్త విజయ్‌ పలు సందర్భాల్లో మందలించాడు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు చెబుతున్నారు.

విజయవాడ: ప్రేమ పేరుతో వివాహితకు ట్రాప్.. భర్తకు దూరం చేసి, గదికి పిలిపించి

ఇటీవల మరోసారి భర్త కవితను హెచ్చరించాడు.. అయినా సరే ఆమె మాత్రం పద్ధతి మార్చుకోలేదు. అప్పుడు భర్త, అత్తపై కోపం పెంచుకుంది.. వారిని అడ్డు తొలగించుకోవాలని భావించింది. వాళ్లిద్దర్ని చంపేయాలని మైనర్ బాలుడిని కవిత రెచ్చగొట్టింది. మైనర్ బాలుడు ఫిబ్రవరి 5న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్త నిర్మలపై దాడికి పాల్పడ్డాడు. ఆమె కళ్లల్లో కారం కొట్టి, కత్తితో గొంతు కోసి హత్య చేయడాని ప్రయత్నించాడు. నిర్మల బాలుడ్ని ప్రతిఘటించి పెద్దగా కేకలు వేసింది. వెంటనే చుట్టుపక్కల జనాలు పరుగెత్తుకొచ్చారు. వాళ్లను చూసి ఆ బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిర్మల గొంతుపై తీవ్ర గాయం కావడంతో వెంటనే స్థానికులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడైన బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కవిత రెచ్చగొట్టడంతోనే మైనర్ బాలుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. కవిత మాత్రం పరారీలో ఉంది.. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి