Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం

8 February 2026

Monica Song: పూజా పాపకే సవాలు విసిరిన బుడ్డోడు..’మౌనికా’ సాంగ్‌కు అద్దిరిపోయే స్టెప్పులు.. వీడియో

8 February 2026

Hyderabad: రూ. 5వేల కోట్లు విలువైన ఆన్‌లైన్ గేమింగ్ .. ముఠా ఆటకట్టించిన GST, ఇంటెలిజెన్స్ అధికారులు

8 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Telangana: భార్యపై అనుమానం.. ఆమెను వదిలించుకునేందుకు భర్త పెద్ద స్కెచ్.. అప్పుడే అసలు ట్విస్ట్!
తెలంగాణ

Telangana: భార్యపై అనుమానం.. ఆమెను వదిలించుకునేందుకు భర్త పెద్ద స్కెచ్.. అప్పుడే అసలు ట్విస్ట్!

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telangana: భార్యపై అనుమానం.. ఆమెను వదిలించుకునేందుకు భర్త పెద్ద స్కెచ్.. అప్పుడే అసలు ట్విస్ట్!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అనుమానం పెనుభూతం అంటారు. ఆ అనుమానమే నిండు జీవితాన్ని బలి తీసుకుంది. భర్త అనుమానం వల్ల, ప్రేమించి, పెళ్ళి చేసుకున్న పాపానికి ఓ మహిళ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. భార్యను వదిలించుకునేందుకు భర్త పక్కా ఫ్లాన్ వేశాడు. ఆ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల వద్ద భర్త కట్టుకథలు పనిచేయలేదు.. చివరికి కటకటాల పాలయ్యాడు.

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లుకు చెందిన పేరబోయిన సైదులు, మిర్యాలగూడకు చెందిన కుమ్మరి అనూషలు 16 ఏళ్ల కిందట ప్రేమించి, పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. అనూష రావువారిగూడెంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. సైదులు కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అనూష.. రావూరి గూడెంతో పాటు కామేపల్లి గ్రామంలో ఇన్‌చార్జి అంగన్‌వాడీ టీచర్‌గా కూడా పనిచేస్తుంది.

భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సైదులు కొన్నాళ్లుగా ఆమెను మాటలతో వేధించడమే కాకుండా, కొడుతూ హింసపెడుతున్నాడు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పుకోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు పంచాయితీ పెట్టి హెచ్చరించినా సైదులు ప్రవర్తన మార్పు రాలేదు. పైగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఏకంగా ఆమెను పర్మినెంట్‌గా వదిలించేందుకునేందుకు పెద్ద స్కెచ్ వేశాడు.

పక్కా ప్లాన్ తో…

ఈ క్రమంలో భర్త సైదులు ఆమైపై మరింత అనుమానం పెంచుకున్నాడు. అక్టోబర్ 5వ తేదీన అనూషను కామేపల్లి గ్రామంలో దించి సైదులు తిరిగి ఇంటికి వచ్చాడు. అక్కడ స్కూల్‌ ముగిసిన తర్వాత తిరిగి తనను తీసుకెళ్లాలని సైదులుకు అనూష ఫోన్‌ చేసింది. ఎలాగైనా అనూషను హతమార్చాలని స్కెచ్ వేసిన సైదులు, తనకు లేటవుతుందని అక్కడే కొద్దిసేపు ఉండమని భార్యకు చెప్పాడు. చీకటి పడిన తర్వాత కామేపల్లికి చేరుకున్న సైదులు అనూషను బైక్‌పై ఎక్కించుకుని రావులపెంట గ్రామ శివారులో గల నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ బ్రిడ్జి మీదుగా తీసుకెళ్లాడు. అక్కడే అనుకున్న ఫ్లాన్ అమలు చేశాడు. బైక్‌ ఆపి అనూషను తీవ్రంగా కొట్టి కాల్వలోకి తోసేశాడు. ఆ తర్వాత బైక్‌ను కాలువలోకి తోసి, తాను కూడా కాలువలో దూకి ఈదుకుంటూ బయటకు వచ్చాడు.

అప్పుడూ అసలు నాటకం షురూ చేశాడు.. ప్రమాదవశాత్తు బైక్‌తో పాటు కాల్వలో పడిపోయామని, తన భార్య గల్లంతైందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాల్వలో గల్లంతైన అనూష మృతదేహం గరిడేపల్లి మండలం పొనుగోడు రిజర్వాయర్‌ కనిపించడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అల్లుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన మృతురాలి తల్లి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైదులును అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తానే కాల్వలోకి తోసేసినట్లు అంగీకరించాడు. దీంతో సైదులును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Hyderabad: రూ. 5వేల కోట్లు విలువైన ఆన్‌లైన్ గేమింగ్ .. ముఠా ఆటకట్టించిన GST, ఇంటెలిజెన్స్ అధికారులు

8 February 2026

Loan App Fraud: చెప్పకుండానే అకౌంట్లో రూ.29 లక్షలు వేశారు! ఆ తర్వాత అసలు సినిమా మొదలెట్టారు..

8 February 2026

Watch: ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు జంకుతున్న జనాలు!

8 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
జాతీయం

అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం

8 February 2026

H5N1 వైరస్.. ఈ పేరు వింటే వెంటనే గుర్తురాకపోవచ్చు. కానీ బర్డ్‌ఫ్లూ అనగానే చనిపోయిన కోళ్లు గొయ్యి తీసి గుట్టలుగా…

Monica Song: పూజా పాపకే సవాలు విసిరిన బుడ్డోడు..’మౌనికా’ సాంగ్‌కు అద్దిరిపోయే స్టెప్పులు.. వీడియో

8 February 2026

Hyderabad: రూ. 5వేల కోట్లు విలువైన ఆన్‌లైన్ గేమింగ్ .. ముఠా ఆటకట్టించిన GST, ఇంటెలిజెన్స్ అధికారులు

8 February 2026

Valentine’s Day 2026: వాలెంటైన్స్ డే రోజు గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారో తెలుసా?

8 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం

8 February 2026

Monica Song: పూజా పాపకే సవాలు విసిరిన బుడ్డోడు..’మౌనికా’ సాంగ్‌కు అద్దిరిపోయే స్టెప్పులు.. వీడియో

8 February 2026

Hyderabad: రూ. 5వేల కోట్లు విలువైన ఆన్‌లైన్ గేమింగ్ .. ముఠా ఆటకట్టించిన GST, ఇంటెలిజెన్స్ అధికారులు

8 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.