Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

AP 10th Revised Time Table 2026: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల తేదీలు మారాయ్‌!

7 February 2026

Ishan Kishan vs Sanju Samson : ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తేలిపోయింది

7 February 2026

Actress Meenakshi Chaudhary Visits Tirumala,తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మీనాక్షి చౌదరి – actress meenakshi chaudhary visits tirumala temple

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»CM Revanth: సీఎం ఢిల్లీ పర్యటనలతో నేతల్లో ఆశలు.. నామినేటెడ్‌ మాదిరే పార్టీ పదవులకు డిమాండ్‌!
తెలంగాణ

CM Revanth: సీఎం ఢిల్లీ పర్యటనలతో నేతల్లో ఆశలు.. నామినేటెడ్‌ మాదిరే పార్టీ పదవులకు డిమాండ్‌!

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
CM Revanth: సీఎం ఢిల్లీ పర్యటనలతో నేతల్లో ఆశలు.. నామినేటెడ్‌ మాదిరే పార్టీ పదవులకు డిమాండ్‌!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అగ్రనేతల ఢిల్లీ పర్యటనలు చూసి.. వాళ్లంతా బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ పండక్కి పదవుల దావత్‌ చేసుకుందామని ఎంతో ఆశపడ్డారు. ఇగ టైగర్‌కి టైమొచ్చిందని అనుచరుల దగ్గర గప్పాలు కొట్టారు. ఇప్పుడేమో అసలు విషయం తెలిసి.. యే రాలే.. టైగర్‌కు టైం రాలే.. అని సర్ది చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారట. దసరా ఎలాగూ లేదు.. దీపావళికైనా ధమాకా పేలుతుందా? లేదా? అని ఎదురుచూస్తున్నారట. ఇంతకీ ఇదంతా ఏంటసలు అనుకుంటున్నారా? దెన్‌ హ్యావ్‌ ఏ లుక్‌.

పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో… నామినేటెడ్‌ పదవుల కోసం పోటాపోటీగా ఎగబడిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు… ఇప్పుడు సేమ్‌ టు సేమ్‌… పార్టీ పదవుల కోసం కూడా అలాగే ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్‌ పోస్టులు దక్కనివారు కనీసం అధికార పార్టీలో ఏదో ఒక పదవి దక్కకపోదా? అని ఎదురుచూస్తున్నారట. కళ్లు కాయలు కాచేలా వెయిట్‌ చేస్తున్నారు. ఈరోజు, రేపు అంటూ… ఊరిస్తున్న కాంగ్రెస్‌ హైకమాండ్.. దసరా పండగ సందర్భంగా ఆ పందేరాన్ని పూర్తి చేయాలని భావించింది. దీంతో ఈ పండక్కి పదవులు దక్కించుకుని.. ఫుల్‌ దావత్‌ చేసుకుందామనుకున్నారు నేతలు.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌.. ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో.. ఈ దసరాలోపు పదవులు పక్కా అనే విశ్వాసం నాయకుల్లో మరింత పెరిగింది. దసరాకు పదవుల దమాకా.. అంటూ భారీగా ప్రచారం కూడా జరిగింది. పీసీసీ కార్యవర్గంతో పాటు, మిగిలిపోయిన నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా జరిగిపోతుందంటూ.. గాంధీభవన్‌ సర్కిల్‌లో విస్తృత చర్చే జరిగింది. అయితే, నేతలు పెంచుకున్న ఆశలపై… నీళ్లు చల్లినట్టుగా సరికొత్త ముచ్చట తాజాగా వెలుగులోకి వచ్చింది. పండగలోపు పదవుల పందేరం ఉండేలా లేదని పార్గీవర్గాలు చెబుతున్నాయి. ఆలోపే పూర్తవుతుందనుకున్నా.. ఆ అవకాశం కనిపించట్లేదట. అలా ప్రకటన రాగానే.. ఇలా పదవీ బాధ్యతలు చేపట్టి, దసరాకు మరో దసరాను జోడించి సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్న నేతలు.. తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారట.

ఇవి కూడా చదవండి

పార్టీ ముఖ్యలు ఢిల్లీ వెళ్లి… పిసిసి కార్యవర్గంతో పాటు నామినేటెడ్ పోస్టులు, క్యాబినెట్ విస్తరణ సహా కీలక అంశాలపై చర్చించినట్టు ప్రచారం జరిగింది. దీంతో వెరీ సూన్‌… పదవుల జాతర పక్కాగా ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఢిల్లీ వెళ్లి ఖర్గే సహా అగ్రనేతలతో సమావేశమైన రేవంత్‌… పార్టీ పదవులపై ఎలాంటి చర్చా జరపలేదని తెలుస్తోంది. ఆ అవకాశం కూడా రాలేదట. ఎందుకంటే, జమ్ము కాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలపై పార్టీ పోస్టుమార్టం చేస్తోందట. దీంతో, తెలంగాణలో పదవుల పంపకం అంశాన్ని, ఇప్పటికి పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.

దసరాలోపు పక్కాగా ఏదో ఒక పదవి పక్కాగా తమను వరిస్తుందని ఆశపడిన చాలా నేతలు… కనీసం పండగ తర్వాతనైనా ప్రకటన ఉంటుందా లేదా అనే మీమాంసలో పడ్డారట. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 10 నెలలవుతున్నా… కష్టపడ్డ తమను గుర్తించడం లేదని వాపోతున్నారట. కనీసం దీపావళికైనా తమ కళ్లలో ఆనందపు వెలుగులు నింపేలా… పదవుల ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారట. ఆలస్యం చేస్తే.. నేతలు, వాళ్లను నమ్ముకున్న క్యాడరూ.. నిరుత్సాహం చెందే అవకాశం ఉందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఇప్పటికే నేతలందరూ పార్టీ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్టు అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మరి, హైకమాండ్‌ ఎలా వ్యవహరిస్తుందన్నదే తెలియాల్సి ఉంది.

ఇది చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి సీన్ ఇది.. అసలేం జరిగిందంటే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా..

7 February 2026

Telangana: 50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం..

7 February 2026

Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. మార్చి 15 నుంచే అమలు..

7 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

AP 10th Revised Time Table 2026: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల తేదీలు మారాయ్‌!

7 February 2026

అమరావతి, ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇప్పటికే…

Ishan Kishan vs Sanju Samson : ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తేలిపోయింది

7 February 2026

Actress Meenakshi Chaudhary Visits Tirumala,తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మీనాక్షి చౌదరి – actress meenakshi chaudhary visits tirumala temple

7 February 2026

Video: తొలి బంతికే బౌండరీ.. అఫ్రిదికి బడితపూజ చేసిన డచ్ బ్యాటర్లు.. కట్‌చేస్తే.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయలేగా..

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

AP 10th Revised Time Table 2026: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల తేదీలు మారాయ్‌!

7 February 2026

Ishan Kishan vs Sanju Samson : ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తేలిపోయింది

7 February 2026

Actress Meenakshi Chaudhary Visits Tirumala,తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మీనాక్షి చౌదరి – actress meenakshi chaudhary visits tirumala temple

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.