ఇంజిన్ ఆరోగ్యం.. ఆయిల్ మార్పు: బైక్‌కు ఇంజిన్ ఆయిల్ ప్రాణం వంటిది. మురికిగా ఉన్న లేదా పాతబడిన ఇంజిన్ ఆయిల్ వల్ల ఇంజిన్ భాగాలు ఒకదానికొకటి రాపిడికి గురై కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల పెట్రోల్ వినియోగం పెరుగుతుంది. అలాగే ఎయిర్ ఫిల్టర్ విషయంలో జాగ్రత్త వహించాలి. గాలి సరిగ్గా అందకపోతే కంబషన్ ప్రక్రియ దెబ్బతిని మైలేజ్ గణనీయంగా తగ్గుతుంది.
టైర్ ప్రెజర్: చాలామంది టైర్లలో గాలిని పట్టించుకోరు. టైర్లలో గాలి తక్కువగా ఉంటే రోడ్డుపై ఘర్షణ పెరుగుతుంది. దీనివల్ల ఇంజిన్ ఎక్కువ శక్తిని వెచ్చించాల్సి వస్తుంది. వారానికి ఒకసారి టైర్ ప్రెజర్ చెక్ చేయించుకోవడం వల్ల మైలేజ్ 5 -10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
గేర్ మేనేజ్‌మెంట్: తక్కువ స్పీడ్‌లో ఎక్కువ గేర్ లేదా ఎక్కువ స్పీడ్‌లో తక్కువ గేర్ వాడటం ఇంజిన్‌కు శాపం. వేగానికి తగినట్లుగా గేర్లు మార్చడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది. సిగ్నల్స్ దగ్గర లేదా ఖాళీగా ఉన్నప్పుడు అనవసరంగా యాక్సిలరేటర్ పెంచడం వల్ల పెట్రోల్ వృథా అవుతుంది. ప్రయాణంలో 40-50 kmph స్థిరమైన వేగంతో వెళ్లడం ఉత్తమం.
అదనపు భారం: బైక్‌పై అనవసరమైన మోడిఫికేషన్లు, భారీ క్రష్ గార్డులు లేదా అనవసరమైన బరువులు ఉంచడం వల్ల మైలేజీ పడిపోతుంది. వాహనం ఎంత తేలికగా ఉంటే ఇంజిన్‌పై అంత తక్కువ ఒత్తిడి పడుతుంది.
బైక్ షోరూమ్ వాళ్లు సూచించిన సమయానికి రెగ్యులర్ సర్వీసింగ్ చేయించడం వల్ల చిన్న చిన్న సమస్యలు ముందే గుర్తించవచ్చు. స్పార్క్ ప్లగ్ క్లీనింగ్, చైన్ లూబ్రికేషన్ వంటివి క్రమం తప్పకుండా చేస్తే మీ వాహనం స్మూత్‌గా నడవడమే కాకుండా మీ జేబుకు చిల్లు పడకుండా చూసుకోవచ్చు.






