Svims Sri Padmavathi Women Medical College,ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థులకు రిలీఫ్.. ఐదేళ్లకు కాదు నాలుగున్నర ఏళ్లకే ఫీజులు.. టీటీడీ నిర్ణయం – ttd relief for nri mbbs students fee limited to 4 and half years in svims sri padmavathi women medical college
ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్విమ్స్ – శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థుల ట్యూషన్ ఫీజులను ఐదేళ్లకు కాకుండా నాలుగున్నర ఏళ్లకే వసూలు చేయాలని నిర్ణయించింది. ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
హైలైట్:
ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థులకు టీటీడీ రిలీఫ్
ట్యూషన్ ఫీజులను నాలుగున్నరేళ్లకే వసూలు చేయాలని నిర్ణయం
విద్యార్థుల విజ్ఞప్తితో టీటీడీ ఈవో రవిచంద్ర నిర్ణయం
స్విమ్స్ శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కాలేజీ(ఫోటోలు– Samayam Telugu)
ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని స్విమ్స్ – శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో 2021-22 బ్యాచ్ ఎంబీబీఎస్ కోర్సు ట్యూషన్ ఫీజులను ఐదేళ్లకు కాకుండా నాలుగున్నర సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించింది. పద్మావతి మహిళా వైద్య కళాశాలలో చదువుతున్న 2021-22 బ్యాచ్ ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ విద్యార్థులు , వారి తల్లిదండ్రులు టీటీడీ ఏవో ముద్దాడ రవిచంద్రతో ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ కోర్సు వ్యవధి కాలం నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే కావటంతో.. నాలుగున్నరేళ్లకు మాత్రమే ఫీజులు తీసుకోవాలని కోరారు. స్విమ్స్ – శ్రీపద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ట్యూషన్ ఫీజును ఐదు సంవత్సరాలకు వసూలు చేస్తున్నారని.. దీనిని నాలుగున్నరేళ్లకు తగ్గించాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల వినతిపై స్పందించిన టీటీడీ ఈవో.. ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ కోర్సు ట్యూషన్ ఫీజులను నాలుగున్నర సంవత్సరాలకు మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించారు.నేషనల్ మెడికల్ కమిషన్ ఏప్రిల్ ఏడో తేదీన జారీ చేసిన నిబంధనలను పరిశీలించిన అనంతరం టీటీడీ ఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయటం కోసం.. స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. అనంతరం రాటిఫికేషన్ పొందేలా టీటీడీ ఈవో చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు ప్రస్తుతం 2021-22బ్యాచ్ విద్యార్థులు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్‌లో ఉండటంతో, వారికి నాలుగున్నరేళ్లకే ఫీజులు వర్తింపజేయాలని నిర్ణయించారు. అలాగే వచ్చే బ్యాచుల నుంచి ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు.
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో అనేక విద్యాసంస్థలు నడుస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ, పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల, వెంకటేశ్వర సంగీత, నృత్య కాలేజీ నడుస్తున్నాయి. మరోవైపు శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కాలేజీని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) నిర్వహిస్తోంది. 2014లో దీనిని స్థాపించగా.. ఇందులో 150 సీట్లు ఉన్నాయి.
రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.
వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి