Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs IRE : బీసీసీఐకి కొత్త టెన్షన్.. టీమిండియా ఐర్లాండ్ పర్యటన రద్దవుతుందా?

12 June 2026

చమురు కొనుగోలుపై విమర్శలా..? యూరప్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన విదేశాంగ మంత్రి!

12 June 2026

రాజకీయాల్లోకి వస్తున్నా.. కానీ మీరు చెబితేనే – రాఘవ లారెన్స్ | actor Raghava Lawrence tweets about political entry and requesting fans opinions goes viral on social media

12 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ips Pv Sunil Kumar On Tvk Vijay To Swearing As Cm,Tvk Vijay సీఎం కావడానికి, పుష్ప 2 సినిమాకు సంబంధం ఏంటి సార్.. AP IPS పీవీ సునీల్ కుమార్ ట్వీట్‌పై ఆసక్తికర చర్చ – andhra pradesh ips officer pv sunil kumar tweeted that he watched his favorite pushpa 2 on the occasion of tvk vijay to become tamil nadu cm
ఆంధ్రప్రదేశ్

Ips Pv Sunil Kumar On Tvk Vijay To Swearing As Cm,Tvk Vijay సీఎం కావడానికి, పుష్ప 2 సినిమాకు సంబంధం ఏంటి సార్.. AP IPS పీవీ సునీల్ కుమార్ ట్వీట్‌పై ఆసక్తికర చర్చ – andhra pradesh ips officer pv sunil kumar tweeted that he watched his favorite pushpa 2 on the occasion of tvk vijay to become tamil nadu cm

.By .8 May 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ips Pv Sunil Kumar On Tvk Vijay To Swearing As Cm,Tvk Vijay సీఎం కావడానికి, పుష్ప 2 సినిమాకు సంబంధం ఏంటి సార్.. AP IPS పీవీ సునీల్ కుమార్ ట్వీట్‌పై ఆసక్తికర చర్చ – andhra pradesh ips officer pv sunil kumar tweeted that he watched his favorite pushpa 2 on the occasion of tvk vijay to become tamil nadu cm
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


IPS Pv Sunil Kumar On Tvk Vijay And Pushpa 2 Movie: తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగామారాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. గవర్నర్ 118 ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సిందేనని చెప్పడంతో విజయ్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. తమిళనాడు పరిణామాలపై ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

హైలైట్:

  • విజయ్ సీఎం కావడానికి పుష్ప సినిమాకు లింకేటి
  • ఏపీ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ట్వీట్‌పై చర్చ
  • ఆయన అలా ఎందుకు ట్వీట్ చేశారంటూ చర్చ
Pv Sunil Kumar On Tvk Vijay
టీవీకే విజయ్‌పై పీవీ సునీల్ కుమార్(ఫోటోలు– Samayam Telugu)
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. 108 సీట్లు గెలిచిన విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మరో 10మంది మద్దతు కావాలి. కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు మద్దతు తెలిపినా సరే మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. గవర్నర్ మాత్రం 118 ఎమ్మెల్యే మద్దతు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని చెప్పేశారు. ఇటు డీఎంకే, అన్నా డీఎంకేలు వేచి చూసే ధోరణిలో ఉంది. విజయ్ క్యాంప్ మాత్రం వారి ప్రయత్నాలు కొనసాగిస్తూనే.. ఒకవేళ తమను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగితే తమ 107 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని చూస్తోందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు తప్పవు.. మరి విజయ్ అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలి. తమిళనాడులో సందిగ్థత కొనసాగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తమినాడులో పరిణామాలను ప్రస్తావిస్తూ ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘విజయ్ ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగా నాకు ఇష్టమైన పుష్ప 2 చూడడం జరిగింది’ అంటూ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు. అదేంటి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడానికి.. పీవీ సునీల్ కుమార్ పుష్ప 2 సినిమా చూడటానికి సంబంధం ఏంటని చర్చ జరుగుతోంది. విజయ్ సీఎం కావడానికి.. పుస్ప సినిమాకు లింక్ ఏంటి సార్ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అయితే పీవీ సునీల్ కుమార్ చేసిన ఈ ట్వీట్ చూస్తే.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ గురించి ప్రస్తావించారా అనే చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో పుష్ప క్యారెక్టర్‌లో అల్లు అర్జున్ కూలీ స్థాయి నుంచి ఏకంగా ముఖ్యమంత్రిని మార్చే స్థాయికి ఎదుగుతారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పీవీ సునీల్ కుమార్ ట్వీట్ చేశారా అంటూ కొందరు చర్చించుకుంటున్నారు. విజయ్ కూడా పార్టీ పెట్టిన రెండేళ్లలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఘన విజయం సాధించే స్థాయికి ఎదిగారని.. అందుకే పుష్ప 2 సినిమాతో విజయ్‌కు లింక్ పెట్టి ఈ ట్వీట్ చేశారనే వాదన కూడా ఉంది. అలాగే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ అది నా బ్రాండ్ అంటూ డైలాగ్ చెబుతారు. విజయ్ కూడా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన బ్రాండ్ ఇమేజ్ ఏంటో అందరికి చూపించారు. కాబట్టి అందుకే పుష్ప 2కు విజయ్‌కు లింక్ పెట్టారా అనే మరో చర్చ జరుగుతోంది. మొత్తం మీద విజయ్ గురించి పీవీ సునీల్ కుమార్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి