ఎంతసేపూ టాప్ హీరోయిన్లేనా.. మా గురించి కూడా అప్పుడప్పుడూ ఆలోచించండి.. మేం కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నామంటూ గుర్తు చేస్తున్నారు కొందరు చిన్న హీరోయిన్లు. వాళ్లను స్మాల్ స్టార్స్ అనడానికి కూడా లేదు. టాప్ స్టార్స్‌తో అవకాశాలు అందుకుంటూ.. స్టార్ స్టేటస్ కోసం పోటీ పడుతున్నారు కొందరు బ్యూటీస్. మరి వాళ్లెవరో చూద్దామా..? కొందరు ముద్దుగుమ్మలకు అందం ఉంటుంది కానీ లక్కే కాస్త దూరంగా ఉంటుంది. అందులో కయాదు లోహర్ కూడా ఉంటారు. డ్రాగన్ సినిమాతో హార్ట్ త్రోబ్‌గా మారిన ఈ బ్యూటీ.. ఫంకీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కానీ ప్రస్తుతం ప్యారడైజ్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు కయాదు.. అది ఆడితే అమ్మడి రేంజ్ మారడం ఖాయం. నయన్ సారిక పేరు కూడా టాలీవుడ్‌లో బాగా వినిపిస్తుందిప్పుడు. అమ్మడి ఖాతాలో ఆయ్, క లాంటి విజయాలున్నాయి. 2026లో శ్రీ విష్ణుతో విష్ణు విన్యాసం, సంగీత్ శోభన్‌తో రాకాస సినిమాలు చేసారు.. ప్రస్తుతం నారా రోహిత్‌తో సినిమాకు కమిటయ్యారు. అలాగే సాక్షి వైద్య సైతం నారీ నారీ నడుమ మురారితో హిట్ కొట్టారు. ఇప్పుడేకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఈమె పేరు వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి సినిమాలో హీరోయిన్‌గా సాక్షి వైద్య పేరు బలంగా వినిపిస్తుంది. నిజానికి ఉస్తాద్‌లోనే ఈమె నటించాల్సి ఉన్నా డేట్స్ కుదర్లేదు. ఇక రుక్మిణి వసంత్ సైతం టాలీవుడ్‌పై ఫోకస్ చేసారు. ఎన్టీఆర్‌తో నటిస్తున్న ఈ బ్యూటీకి.. అప్పుడే స్టార్స్ నుంచి పిలుపు అందుతుంది. మొత్తానికి వీళ్లదైన రోజు ఈ బ్యూటీస్ స్టార్ స్టేటస్ అందుకోవడం పెద్ద విషయమే కాదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉత్తర కొరియా ఫోన్ల వెనుక భయంకర నిజాలు.. ప్రతి 2 నిమిషాలకు స్క్రీన్‌షాట్
Hair Clips: హెయిర్ క్లిప్స్‌తో జుట్టుకు ప్రమాదం! నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే
సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం
కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??
కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?

