Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కోత్త రూల్స్

6 June 2026

పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు.. పవర్ఫుల్ ఫుడ్ ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు!

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Employees Retirement Age Increase To 65,ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు మరోసారి పెంపు?.. అమ్మో ఈసారి అన్ని ఏళ్లు పెంచుతారా! – andhra pradesh govt likely to increase employees retirement age to 65 soon says education department joint director muvva ramalingam
ఆంధ్రప్రదేశ్

Ap Govt Employees Retirement Age Increase To 65,ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు మరోసారి పెంపు?.. అమ్మో ఈసారి అన్ని ఏళ్లు పెంచుతారా! – andhra pradesh govt likely to increase employees retirement age to 65 soon says education department joint director muvva ramalingam

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Employees Retirement Age Increase To 65,ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు మరోసారి పెంపు?.. అమ్మో ఈసారి అన్ని ఏళ్లు పెంచుతారా! – andhra pradesh govt likely to increase employees retirement age to 65 soon says education department joint director muvva ramalingam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Govt Employees Retirement Age 65: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు అంశంపై విద్యాశాఖ మౌలిక సదుపాయాల జేడీ మువ్వా రామలింగం కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 62 ఏళ్లుగా ఉంది.. కాగా ఈ వయో పరిమితిని 65 సంవత్సరాలకు పెంచే అవకాశం ఉందని రామలింగం తెలిపారు. విద్యాశాఖలో ఒక ఉద్యోగి పదవీవిరమణ సభలో ఆయన ఈ బహిరంగ ప్రకటన చేశారు.

హైలైట్:

  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు
  • 62 నుంచి 65కు పెంచే అవకాశం ఉందంటున్నారు
  • విద్యాశాఖకు చెందిన జేడీ రామలింగం చెప్పారు
AP Govt Employees Retirement Age 65
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 65కు పెంపు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచనుందా.. ఇటీవల కాలంలో జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వ అధికారి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ మౌలిక సదుపాయాల జేడీ మువ్వా రామలింగం చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లా కావలి డిప్యూటీ డీఈవో ఎం హరిప్రసాద్‌ రిటైర్మెంట్ సన్మాన సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు. రిటైర్ అవుతున్న హరిప్రసాద్‌ మరో నాలుగు నెలలు సర్వీసులో ఉంటే బాగుండేది అన్నారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 65 ఏళ్లకు పెరిగే అవకాశం ఉందన్నారు మువ్వా రామలింగం.

ఇంతలో మువ్వ రామలింగం వ్యాఖ్యలపై ఓ స్కూల్ హెడ్‌మాస్టర్ స్పందించారు.. తమకు సర్వీసు వయసు ఇక చాలు సార్‌ అంటూ చెప్పుకొచ్చారు. తాము ఇప్పటికే శాఖాపరంగా ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతున్నాము అన్నారు. వెంటనే స్పందించిన రామలింగం అలా అందరం చెబుతామని.. ఉద్యోగ కాలం పెరిగితే కొనసాగేందుకే ఇష్టపడతామన్నారు. తనవరకు మాత్రం మరో పదేళ్లయినా.. అంటే 72 ఏళ్ల వరకు పనిచేసేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు రామలింగం. మొత్తం మీద రాష్ట్ర విద్యాశాఖ మౌలిక సదుపాయాల జాయింట్ సెక్రటరీ మువ్వా రామలింగం రిటైర్మెంట్ వయసు పెంపుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లుగా ఉంది. గతంలో ప్రభుత్వం 62 ఏళ్లకు పదవీ విరమణ వయసును పెంచిన సమయంలో ఉద్యోగుల్లో చర్చ జరిగింది.. భిన్న వాదనలు వినిపించాయి. మరి అలాంటిది ఒకవేళ రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచితే ప్రభుత్వ ఉద్యోగులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. అంతేకాదు ఒకవేళ పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు.. కానీ ప్రభుత్వంలో కీలక అధికారి వయసు పెరిగే అవకాశం ఉందని చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి