Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Video: రోడ్డుపై ఓ మూటతో నిల్చున్న వ్యక్తి.. ఆటోను ఆపి డ్రైవర్‌ను పిలిచాడు.. సీన్ కట్‌చేస్తే.. ట్విస్ట్ మాములుగా లేదుగా..!

6 June 2026

Tdp Three Rajya Sabha Mp Candidates Announce,టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?.. రెండు పేర్లు ఫైనల్, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు పరిశీలన! – tdp to announce three candidates for rajya sabha rajya sabha mp seats today

6 June 2026

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd Sv Music College Admissions 2026,సంగీతం, డ్యాన్స్ నేర్చుకోవాలని ఉందా.. టీటీడీ అద్భుత అవకాశం, రూ.50 కడితే చాలు – ttd invite applications invited for admissions to sv music dance college and nadaswaram school from june 2nd 2026
ఆంధ్రప్రదేశ్

Ttd Sv Music College Admissions 2026,సంగీతం, డ్యాన్స్ నేర్చుకోవాలని ఉందా.. టీటీడీ అద్భుత అవకాశం, రూ.50 కడితే చాలు – ttd invite applications invited for admissions to sv music dance college and nadaswaram school from june 2nd 2026

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd Sv Music College Admissions 2026,సంగీతం, డ్యాన్స్ నేర్చుకోవాలని ఉందా.. టీటీడీ అద్భుత అవకాశం, రూ.50 కడితే చాలు – ttd invite applications invited for admissions to sv music dance college and nadaswaram school from june 2nd 2026
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఏపీలో సంగీతం నేర్చుకోవాలనుకునేవారికి టీటీడీ అధ్బుత అవకాశం కల్పించింది. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వరం, డోలు పాఠ‌శాల‌లో 2026-27 విద్యా సంవత్సరానికి పలు రెగ్యుల‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌ు ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులు కాలేజీలో ద‌ర‌ఖాస్తులు జారీ చేస్తారు.. వాటిని వెంటనే పూర్తి చేసి ద‌ర‌ఖాస్తులు అందజేయాలి. ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు స్వీక‌రిస్తారని టీటీడీ తెలిపింది.

‘తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వరం, డోలు పాఠ‌శాల‌లో ఫుల్ టైమ్‌ / పార్ట్‌టైమ్ వ్యవ‌ధి గ‌ల కోర్సులలో గాత్రం, వీణ, వేణువు, వయోలిన్‌, నాదస్వరం, డోలు, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, హరికథ, మృదంగం, ఘటం విభాగాలున్నాయి. బి.మ్యూజిక్‌, బి డ్యాన్స్‌, విశారద, ప్రవీణ కోర్సులున్నాయి. ఎస్వీ నాదస్వర పాఠశాలలో సర్టిఫికేట్‌, డిప్లొమా రెగ్యులర్‌ కోర్సులతోపాటు సాయంత్రం కళాశాల పార్ట్‌టైమ్‌ కోర్సులున్నాయ’ అని టీటీడీ తెలిపింది.

‘ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల కార్యాలయ పనివేళల్లో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు. రెగ్యులర్‌ కోర్సులకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సాయంత్రం కళాశాలకు 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. రెగ్యులర్ కోర్సు చదివే విద్యార్థుల‌కు మాత్రమే నిబంధనలకు లోబడి హాస్టల్ వ‌స‌తి క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. ఇతర వివరాలకు 0877-2264597, 9848374408, 9440793205, 9642796991 నంబ‌ర్ల‌లో సంప్రదించాలి’ అని టీటీడీ సూచించింది.

తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారామ్, జేఈవో (ఆరోగ్యం&విద్య) డాక్టర్ శరత్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజైన ఆదివారం రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై శ్రీరామ పట్టాభిషేక ఘట్టంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సర్వలోకాల పాలకుడిగా, రాజాధిరాజుగా సర్వభూపాల వాహనంపై విహరిస్తూ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన భక్తులు గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి కృపాకటాక్షాలను పొందారు. “సర్వభూపాలులు” అంటే సమస్త రాజులు అని అర్థం. ప్రజలను ధర్మమార్గంలో నడిపించి వారి సంక్షేమాన్ని కాంక్షించే రాజులందరికీ అధిపతి భగవంతుడే అనే సనాతన సందేశాన్ని ఈ వాహనసేవ చాటిచెబుతుంది. జగన్నాయకుడైన శ్రీహరి సమస్త భూపాలులను పరిపాలించే రాజాధిరాజుగా ఈ వాహనంపై దర్శనమిస్తారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tdp Three Rajya Sabha Mp Candidates Announce,టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?.. రెండు పేర్లు ఫైనల్, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు పరిశీలన! – tdp to announce three candidates for rajya sabha rajya sabha mp seats today

6 June 2026

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Video: రోడ్డుపై ఓ మూటతో నిల్చున్న వ్యక్తి.. ఆటోను ఆపి డ్రైవర్‌ను పిలిచాడు.. సీన్ కట్‌చేస్తే.. ట్విస్ట్ మాములుగా లేదుగా..!

6 June 2026

Viral Auto Driver Video: ప్రస్తుత డిజిటల్ యుగంలో రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న వింతలు, విశేషాలు సోషల్…

Tdp Three Rajya Sabha Mp Candidates Announce,టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?.. రెండు పేర్లు ఫైనల్, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు పరిశీలన! – tdp to announce three candidates for rajya sabha rajya sabha mp seats today

6 June 2026

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

6 June 2026

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Video: రోడ్డుపై ఓ మూటతో నిల్చున్న వ్యక్తి.. ఆటోను ఆపి డ్రైవర్‌ను పిలిచాడు.. సీన్ కట్‌చేస్తే.. ట్విస్ట్ మాములుగా లేదుగా..!

6 June 2026

Tdp Three Rajya Sabha Mp Candidates Announce,టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?.. రెండు పేర్లు ఫైనల్, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు పరిశీలన! – tdp to announce three candidates for rajya sabha rajya sabha mp seats today

6 June 2026

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.