Talliki Vandanam Scheme 2026 Beneficiaries Status Check: ఏపీలో ప్రభుత్వం స్కూల్, ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందన పథకం కింద డబ్బులు ఇస్తోంది. ఈ ఏడాది కూడా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ముందుగానే అర్హుల జాబితాలను సిద్దం చేసింది.. విద్యార్థులు అర్హుల జాబితాను చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రత్యేక వెబ్ పోర్టల్ సాయంతో తల్లికి వందనం పథకానికి అర్హులా, కాదా.. అసలు పేరు ఉందో, లేదో తెలుసుకోవచ్చు.
హైలైట్:
- ఏపీలో తల్లికి వందనం పథకం 2026
- తల్లులల అకౌంట్‌లోకి త్వరలో డబ్బులు
- అర్హుల జాబితాలో మీ పేరు చెక్ చేస్కోండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వెబ్ పోర్టల్ సాయంతో తల్లికి వందనం పథకానికి అర్హులో, కాదో వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు www.bm.sgsw.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్కీమ్ ఎలిజిబిలిటీ ఆప్షన్ క్లిక్ చేయగానే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లబ్ధిదారుల ఆధార్ నంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పథకం, ఏ సంవత్సరమో సెలక్ట్ చేసిన తర్వాత గెట్ డిటైల్స్ ఆప్షన్ క్లియ్ చేయాలి. అప్పుడు ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నంబరుతో పాటుగా కింద ఉండే క్యాప్చా ఎంటర్ చేస్తే లబ్ధిదారుల సమాచారం వస్తుంది. ఆ వివరాలను చెక్ చేసుకుని.. ఒకవేళ ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించాలని నర్సీపట్నం సూచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సాంకేతిక సమస్యలతో పాటుగా మ్యాపింగ్ ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్, మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. అలాగే కుటుంబ సభ్యులు మ్యాపింగ్ పూర్తయితేనే తల్లికి వందనం డబ్బులు అందుతాయి. అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులు దగ్గరలోని సచివాలయానికి వెళ్తే అక్కడి సిబ్బంది పరిశీలించి సమస్యను పరిష్కరిస్తారు. ఒకవేళ విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్, మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.


