పొట్ట చుట్టుకొలత కూడా ముఖ్యమే: నిపుణుల ప్రకారం, కేవలం డిజిటల్ మిషన్ పై కనిపించే మొత్తం బరువు మాత్రమే కాదు, మీ ఎత్తుకు తగ్గట్టుగా పొట్ట చుట్టుకొలత (Waist-to-height ratio) ఎంత ఉందనేది కూడా ముఖ్యం. శరీర బరువు అదుపులో ఉన్నప్పటికీ, పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం ఆరోగ్యానికి తీవ్ర హానికరం. కాబట్టి, మీ ఎత్తు ఆధారంగా ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడానికి పోషకాహార నిపుణులు లేదా వైద్యుల సలహాతో సరైన డైట్, వ్యాయామ ప్రణాళికను సిద్ధం చేసుకోవడం మంచిది.

