Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే ఏమౌతుందో తెలుసా..? టీ తయారీ వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

6 June 2026

Viral Video: ఏమన్నా ఐడియానా బాస్.. రోడ్డుపై నడిచే స్విమ్మింగ్‌ పూల్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

6 June 2026

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Mangalagiri-tadepalli Corporation Water Supply,మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌కు తీపికబురు.. రూ.393 కోట్లతో 24 గంటలూ నీళ్లు – andhra pradesh government plans 24 hours drinking water supply project in mangalagiri tadepalli municipal corporation
ఆంధ్రప్రదేశ్

Mangalagiri-tadepalli Corporation Water Supply,మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌కు తీపికబురు.. రూ.393 కోట్లతో 24 గంటలూ నీళ్లు – andhra pradesh government plans 24 hours drinking water supply project in mangalagiri tadepalli municipal corporation

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Mangalagiri-tadepalli Corporation Water Supply,మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌కు తీపికబురు.. రూ.393 కోట్లతో 24 గంటలూ నీళ్లు – andhra pradesh government plans 24 hours drinking water supply project in mangalagiri tadepalli municipal corporation
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Mangalagiri-Tadepalli Corporation 24×7 Drinking Water Supply: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరి-తాడేపల్లి మున్సిపాల్ కార్పొరేషన్‌ తాగునీటి సమస్యకు చెక్ పెట్టే పనిలో ఉంది. 24 గంటలూ నీరు సరఫరా చేసే ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.393 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. భవిష్యత్ అవసరాలను కూడా గుర్తించి అందుకు తగిన విధంగా ప్రాజెక్టును ప్లాన్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • ఏపీ రాజధాని అమరావతికి తాగునీటి ప్రాజెక్ట్
  • ఇకపై 24 గంటలూ తాగునీరు సరఫరా చేస్తారు
  • రూ.393.74 కోట్లతో శాశ్వత తాగునీటి సరఫరా
Mangalagiri-Tadepalli Corporation Water
మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో తాగునీటి సమస్యలకు చెక్ పెట్టే పనిలో ఉంది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ)లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించబోతోంది. ఏకంగా రూ.393.74 కోట్లతో శాశ్వత తాగునీటి సరఫరా పథకాన్ని అమలు చేయబోతోంది. మొత్తం 40 డివిజన్లు ఉండగా.. వాటిలోని 29 జోన్‌లలో పైప్‌లైన్లలో 24 గంటలూ సురక్షిత తాగునీటిని సరఫరా చేయనున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏలు కలిసి సమన్వయంతో ఈ ప్రాజెక్టను తీసుకొస్తున్నారు. ఈ తాగునీటి పథకానికి సంబంధించి త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు.

మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం 2.67 లక్షల జనాభా ఉన్నారు.. అయితే 2055 నాటికి జనాభా 4.47 లక్షల వరకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రోజూ 88.5 మిలియన్‌ లీటర్ల నీరు కావాలని అంచనా వేశారు అధికారులు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా హెచ్‌డీపీఈ పంపిణీ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ను మొత్తం 644 కిలోమీటర్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కోసం ఈఎల్‌ఎస్‌ఆర్‌లు (27 కొత్త ఎలివేటెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్లు) నిర్మించనున్నారు. ప్రస్తుతం మూడు రిజర్వాయర్లు ఉన్నాయి.. వీటితో కలిపి మొత్తం 30 ఈఎల్‌ఎస్‌ఆర్‌లు అందుబాటులో ఉంటాయి. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌లో కొత్తగా 19 వేలకుపైగా ఇళ్లకు కొత్తగా కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్లాన్ చేశారు. నగరంలోని ప్రాంతాలతో పాటుగా గ్రామాలనకు కూడా నీటిని సరఫరా చేసేందుకు జోన్ వ్యవస్థను కూడా తీసుకురానున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం ఈ మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌‌లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కోసం యూఐడీఎఫ్‌ నుంచి రూ.287.54 కోట్లు, అమృత్‌ 2.0లో రూ.51.20 కోట్లు, సీఆర్‌డీఏ నుంచి రూ.55 కోట్లు సమకూరనున్నాయి. సీఆర్డీఏకి సంబంధించిన రింగ్ మెయిన్ల ద్వారా ప్యూరిఫై చేసిన నీళ్లను రోజూ అందిస్తారు. రాజధాని ప్రాంతంలో ఉన్న ఉండవల్లిలో ఉన్న ట్యాపింగ్ పాయింట్ నుంచి తాడేపల్లికి నీళ్లు సరఫరా చేస్తారు. అమరావతిలో ఉన్న ఎంఐజీ లేఅవుట్‌ దగ్గర మరో పాయింట్‌ నుంచి మంగళగిరికి నీరు సరఫరా చేస్తారు. వాటర్ ప్యూరిఫైర్ ప్లాంట్, రా వాటర్ అవసరం లేకపోవడంతో ప్రాజెక్టు అంచనా వ్యయంలో రూ.56.50 కోట్లు ఆదా అయినట్లు చెబుతున్నారు. మొత్తం మీద రాజధాని ప్రాంతంలో తాగునీటి సమస్యకు పరిష్కారం దొరికింది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి