Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026

జూన్ 6 రాశిఫలాలు: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఇలా..

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Apsrtc 50 Electric Buses To Bhogapuram Airport,ఏపీలో ఎయిర్‌పోర్ట్‌కు 50 ఏసీ బస్సులు.. ఆ ఒక్క డిపోకే ఏకంగా 50 బస్సులు కేటాయింపు – apsrtc plan to run 50 electric buses to bhogapuram international airport soon says transport minister mandipalli ramprasad reddy
ఆంధ్రప్రదేశ్

Apsrtc 50 Electric Buses To Bhogapuram Airport,ఏపీలో ఎయిర్‌పోర్ట్‌కు 50 ఏసీ బస్సులు.. ఆ ఒక్క డిపోకే ఏకంగా 50 బస్సులు కేటాయింపు – apsrtc plan to run 50 electric buses to bhogapuram international airport soon says transport minister mandipalli ramprasad reddy

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Apsrtc 50 Electric Buses To Bhogapuram Airport,ఏపీలో ఎయిర్‌పోర్ట్‌కు 50 ఏసీ బస్సులు.. ఆ ఒక్క డిపోకే ఏకంగా 50 బస్సులు కేటాయింపు – apsrtc plan to run 50 electric buses to bhogapuram international airport soon says transport minister mandipalli ramprasad reddy
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


50 Electric Buses To Bhogapuram International Airport Soon:ఏపీకి త్వరలోనే విద్యుత్ బస్సులు పరుగులు తీయబోతున్నట్లు రవాణాశాఖమంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నానికి 100 విద్యుత్ బస్సులు వస్తాయని.. 50 బస్సుల్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు నడుపుతామని మంత్రి ప్రకటించారు. 50 ఎలక్ట్రిక్ బస్సుల్ని గాజువాక ఆర్టీసీ డిపోకు కేటాయిస్తామన్నారు. దూరం వెళ్లే బస్సులకు ఇద్దరు డ్రైవర్లు కచ్చితంగా ఉండాలని.. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

హైలైట్:

  • ఏపీకి త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు
  • 100 బస్సులు విశాఖకు కేటాయింపు
  • 50 బస్సులు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు
50 Electric Buses To Bhogapuram Airport
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 50 విద్యుత్ బస్సులు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌కు త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని తెలిపారు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి. విశాఖపట్నంలో పర్యటించిన ఆయన.. గాజువాక ఆర్టీసీ బస్సు డిపోలో ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. విశాఖపట్నానికి మొత్తం 100 ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తాయని.. వాటిలో 50 బస్సుల్ని బస్సులు గాజువాక ఆర్టీసీ డిపోకు కేటాయిస్తున్నాము అన్నారు. అలాగే విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు త్వరలో 50 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని తెలిపారు. తొలివిడతగా విశాఖ నగరంలో 100 విద్యుత్ బస్సులు.. మరో 100 సీఎన్‌జీ బస్సులు వస్తాయన్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదన్నారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.

విశాఖపట్నంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోయినవారికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామన్నారు. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 11 వేల బస్సులు నడుపుతున్నామన్నారు మంత్రి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాలు కలవరపెడుతున్నాయని.. ప్రమాదాలకు కారణాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామన్నారు. దూరం వెళ్లే బస్సులకు ఇద్దరు డ్రైవర్లను నియమించినట్లు తెలిపారు. గత ఆరు నెలలుగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల ప్రమాదాలపై అధ్యయనం చేశామని.. ఇద్దరు డ్రైవర్లు లేని బస్సుల్ని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు బస్సు ఫిట్‌నెస్‌తో పాటు మనుషులు చేసే తప్పులే ఎక్కువ ఉన్నాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవర్ టెస్టులతో పాటుగా బస్సుల్ని ఆపి డ్రైర్లకు నిద్రమత్తు రాకుండా ముఖం కడిగించే కార్యక్రమం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. సింహాచలం అప్పన్న ఆలయంలోఈ ఏడాది జరిగిన చందనోత్సవంలో మెరుగైన సేవలు అందించిన 20 మంది ఆర్టీసీ సిబ్బందికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందనే చర్చ జరుగుతోంది.. ఈ క్రమంలోనే ఆర్టీసీ అధికారులు 50 విద్యుత్ బస్సుల్ని భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు నడపాలని ప్లాన్ చేస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.

తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి