ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర, మధ్య భారతదేశంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ వేసవితాపం నుంచి ఉపశమనం కోసం చాలామంది ఏసీలు కొంటూఉంటారు. అయితే, లక్షలు ఖర్చుపెట్టి ఏసీ కొనడం కంటే, కేవలం రూ.10,000 బడ్జెట్‌లో మంచి ఎయిర్ కూలర్ కొనడమే తెలివైన నిర్ణయం అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పొడి వాతావరణం ఉండే ప్రాంతాల్లో ఏసీ కన్నా కూలరే ఎన్నో విధాలుగా ఉత్తమం అంటున్నారు. మొదటగా చూసుకోవాల్సింది ఖర్చు. ఒక మంచి డెజర్ట్ ఎయిర్ కూలర్ రూ.8,000 నుంచి రూ.12,000 మధ్యలోనే దొరుకుతుంది. అదే ఏసీ కొనాలంటే కనీసం రూ.30,000 నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. దీనికి అదనంగా స్టెబిలైజర్, ఇన్స్టాలేషన్ ఛార్జీలు కూడా ఉంటాయి. విద్యుత్ వినియోగంలోనూ భారీ తేడా ఉంటుంది. కూలర్ గంటకు 150 నుంచి 250 వాట్ల విద్యుత్‌ను మాత్రమే తీసుకుంటే, ఏసీ 1000 నుంచి 2000 వాట్ల వరకు ఖర్చవుతుంది. దీంతో ఏసీ వాడితే కరెంట్ బిల్లు వేలల్లో వస్తుంది. అదే కూలర్‌తో అయితే ఆ భారం ఉండదు. పొడి వాతావరణం ఉండే ప్రాంతాల్లో కూలర్ గాలికి తేమను జోడించి చల్లదనాన్ని ఇస్తుంది. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే ఏసీ అయితే, గదిలోని తేమను లాగేసి గాలిని పొడిగా మారుస్తుంది. దీనివల్ల చర్మం, కళ్లు పొడిబారడం, గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూలర్‌కు ప్రత్యేక ఇన్స్టాలేషన్ అవసరం లేదు, ఒకచోటనుంచి మరోచోటికి సులభంగా తీసుకెళ్లవచ్చు. నీటి ఆవిరి ద్వారా పనిచేయడం వల్ల ఇది పర్యావరణానికి కూడా హాని చేయదు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, కూలర్ బాగా పనిచేయాలంటే గదిలో గాలి ప్రసరణ ఉండాలి. కిటికీలు లేదా తలుపులు కొద్దిగా తెరిచి ఉంచాలి. తేమ ఎక్కువగా ఉండే తీర ప్రాంతాల్లో ఏసీ ప్రభావవంతంగా పనిచేయొచ్చు. కానీ, మన ప్రాంతాల్లోని పొడి వేడికి మాత్రం డబ్బు ఆదా చేస్తూ, ఆరోగ్యాన్ని కాపాడే కూలరే సరైన ఎంపిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తినడం రాంగ్ టైమ్ లో.. పడుకోవడం రాంగ్ టైమ్ లో.. దెబ్బతింటున్నపేగు ఆరోగ్యం

