ముఖ్యంగా సినిమా చివరి 30 నిమిషాలు, క్లైమాక్స్ లో వచ్చే ఒక మేజర్ ట్విస్ట్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. మనం ఊహించిన వ్యక్తి కాకుండా, అసలు నిందితుడు వేరే ఎవరైనా అనే నిజం తెలిసినప్పుడు ఆడియన్స్‌కు మైండ్ బ్లాక్ అవుతుంది. నటీనటుల పర్ఫార్మెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చినప్పటి నుండి సినిమాను చూసిన ప్రేక్షకులు, సినీ విమర్శకులు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

