Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

6 June 2026

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కోత్త రూల్స్

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ఏపీకి ‘AI డాక్టర్’.. 23 లక్షల ఉద్యోగాలే లక్ష్యం! | Chandrababu Naidu Announces Rs 23 Lakh Crore Investment Plan and AI Doctor Launch at Tuni Pedala Sevalo
తాజా వార్తలు

ఏపీకి ‘AI డాక్టర్’.. 23 లక్షల ఉద్యోగాలే లక్ష్యం! | Chandrababu Naidu Announces Rs 23 Lakh Crore Investment Plan and AI Doctor Launch at Tuni Pedala Sevalo

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఏపీకి ‘AI డాక్టర్’.. 23 లక్షల ఉద్యోగాలే లక్ష్యం! | Chandrababu Naidu Announces Rs 23 Lakh Crore Investment Plan and AI Doctor Launch at Tuni Pedala Sevalo
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh

oi-Lingareddy Gajjala

Time
Published: Monday, June 1, 2026, 14:50 [IST]

పేదల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు సమాజంలో ఆర్థిక అసమానతలను పూర్తిగా తొలగించడమే ధ్యేయంగా కూటమి ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో సోమవారం జరిగిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే రోజు అని, ఆ రోజే రాష్ట్ర ప్రజలకు విధ్వంసక పాలకుల నుంచి విముక్తి కలిగి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిందని గుర్తుచేశారు. గత పాలనలో ప్రజలు బహిరంగంగా నవ్వాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని, సభల నుంచి జనం పారిపోకుండా కందకాలు తవ్వి, ఫెన్సింగ్‌లు వేసిన దుస్థితి ఉండేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని, రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పులు, బకాయిల భారం ఉన్నప్పటికీ.. వెనకడుగు వేయకుండా మొదటి నెల నుంచే పింఛన్లను పెంచి ఇచ్చామని సీఎం వివరించారు.

Chandrababu Naidu Announces Rs 23 Lakh Crore Investment Plan and AI Doctor Launch at Tuni Pedala Sevalo

అసమానతలు లేని ‘బంగారు కుటుంబాలు’ రావాలి

పేదల సేవలో భాగంగా ‘పీ4’ (P4) విధానం ద్వారా మార్గదర్శకులు, బంగారు కుటుంబాలతో చంద్రబాబు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సమాజం లేకుండా మనకు అస్తిత్వం లేదు. వెయ్యి కోట్లో, లక్ష కోట్లో సంపద ఉన్నా మనుషులుగా మనందరి జీవన విధానం ఒక్కటే. అందుకే సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి. ‘బంగారు కుటుంబాల’లోని వారంతా విద్యాధికులుగా, సొంతంగా ఆదాయం ఆర్జించే వ్యక్తులుగా మారాలన్నదే నా ఆకాంక్ష. దీని కోసం మార్గదర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయా పేద కుటుంబాలను పైకి తీసుకురావాలి” అని పిలుపునిచ్చారు.

కేవలం బటన్లు నొక్కితే పైశాచిక ఆనందం వస్తుంది తప్ప, ప్రజల కష్టసుఖాలు తెలియవని గత పాలకులను ఉద్దేశించి విమర్శించారు. తాము ప్రతి నెలా 1వ తేదీన నేరుగా ప్రజల వద్దకే వెళ్లి పెన్షన్లు అందిస్తున్నామని చెబుతూ.. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 62.34 లక్షల మందికి రూ.2,729 కోట్ల పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏదైనా కారణంతో ఒకట్రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా, మూడో నెల అన్ని కలిపి ఇస్తున్నామని, ఈ నెల కొత్తగా 5,606 మందికి రూ.2.24 కోట్ల ‘స్పౌజ్ పెన్షన్లు’ మంజూరు చేశామని తెలిపారు.

ఎన్టీఆర్ భరోసాతో దేశంలోనే రికార్డు

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పెన్షన్లను ఒకేసారి రూ.1,000 పెంచి రూ.4 వేలు చేశామని, దివ్యాంగులకు రూ.6,000, వృద్ధాప్య/ఆరోగ్య పెన్షన్లను రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచామని సీఎం చంద్రబాబు వివరించారు. 2024 జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.65,887 కోట్లను కేవలం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలోనే అందించామని, ఏడాదికి ఈ ఒక్క పథకానికే దాదాపు రూ.32,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. పేద కుటుంబాలకు తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఆటోడ్రైవర్/మత్స్యకారుల సేవలో వంటి 2 నుంచి 4 సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. వీటితో పాటు దివ్యాంగశక్తి పేరిట ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించారు.

పారిశ్రామిక విప్లవం.. 23 లక్షల ఉద్యోగాలే ధ్యేయం

రాష్ట్ర యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమంగా ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు భరోసానిచ్చారు. “రాబోయే 23 నెలల్లో ఏపీకి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. వీటి ద్వారా మన యువతకు 23 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాకినాడ సమీపంలో రూ.80,000 కోట్లతో గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ, తుని పక్కనే ఉన్న అనకాపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సిటీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాబోతున్నాయి” అని సీఎం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తిరిగి పునరుద్ధరించామని, విశాఖ రైల్వే జోన్ కల కూడా సాకారమైందని గుర్తుచేశారు. ‘పీఎం సేతు’ కింద ఏడాదికి 25,000 మంది యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

వైద్య రంగంలో ‘ఏఐ డాక్టర్’.. వాట్సప్ గవర్నెన్స్

పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం.. పాఠశాలల్లో విద్యా సంస్కరణలు తెచ్చి పాఠ్యాంశాలను మారుస్తున్నామని చెప్పారు. ఖరీదైన వైద్యం కోసం పేదలు అప్పులపాలు కాకుండా ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ని తీసుకువస్తున్నామని, ‘సంజీవని’ పేరిట ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానంలో డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందించి పర్యవేక్షిస్తామని వెల్లడించారు. డాక్టర్ అపాయింట్‌మెంట్లు, మందులు, ఆరోగ్య సందేహాల నివృత్తి కోసం త్వరలోనే ‘ఏఐ (AI) డాక్టర్’ను అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రాన్ని ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’గా మార్చేందుకు ఈ ఏడాది జూన్ నెలలో అమరావతిలో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 14 రోజుల పాటు జరిగే ఈ యోగాలో ప్రజలంతా పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

2047 నాటికి ‘స్వర్ణాంధ్ర విజన్’ సాధించడమే లక్ష్యంగా, ప్రజలకు పౌర సేవలను మరింత వేగంగా చేరవేయడానికి ‘వాట్సప్ గవర్నెన్స్’ (WhatsApp Governance) విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ అద్భుతమైన సుపరిపాలన యజ్ఞంలో తన మిత్రుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీలతో కలిసి నిరంతరం శ్రమిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

English summary

AP CM N. Chandrababu Naidu addresses the ‘Pedala Sevalo’ rally in Tuni, unveiling the P4 model for poverty eradication, a ₹23 lakh crore investment plan for 23 lakh jobs, and healthcare upgrades like the ‘AI Doctor’.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

6 June 2026

పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు.. పవర్ఫుల్ ఫుడ్ ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు!

6 June 2026

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

6 June 2026

బంగారం అంటే భారతీయులకు ఓ ప్రత్యేక సెంటిమెంట్. అభరణంగా మాత్రమే కాకుండా కష్టకాలంలో ఆదుకునే ఆర్థిక భరోసాగా నిలుస్తుంది. ఇక…

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కోత్త రూల్స్

6 June 2026

పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు.. పవర్ఫుల్ ఫుడ్ ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు!

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

6 June 2026

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కోత్త రూల్స్

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.