Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

6 June 2026

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కోత్త రూల్స్

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu At Chamavaram Kakinada,”నేను కూడా బటన్ నొక్కవచ్చు.. కానీ”.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు – chandrababu participated pedala sevalo program in chamavaram of kakinada district
ఆంధ్రప్రదేశ్

Chandrababu At Chamavaram Kakinada,”నేను కూడా బటన్ నొక్కవచ్చు.. కానీ”.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు – chandrababu participated pedala sevalo program in chamavaram of kakinada district

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu At Chamavaram Kakinada,”నేను కూడా బటన్ నొక్కవచ్చు.. కానీ”.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు – chandrababu participated pedala sevalo program in chamavaram of kakinada district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కాకినాడ జిల్లా తునిలో పర్యటించారు. తునిలోని చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు.. బటన్ నొక్కటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా బటన్ నొక్కవచ్చని.. కానీ, నేరుగా వచ్చి పింఛన్ అందించి, అధికారుల పనితీరును పర్యవేక్షిస్తే కలిగే ఆనందమే వేరని అభిప్రాయపడ్డారు.

హైలైట్:

  • కాకినాడ జిల్లా తునిలో చంద్రబాబు పర్యటన
  • పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
  • బటన్ నొక్కటంపై కీలక వ్యాఖ్యలు
Cm chandrababu
చామవరంలో చంద్రబాబు పర్యటన(ఫోటోలు– Samayam Telugu)
బటన్ నొక్కటం.. వైసీపీ ప్రభుత్వ హయాంలో బాగా ఫేమస్ అయిన పదం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రత్యక్ష నగదు బదిలీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. పేద ప్రజలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు ఇలా ఎవరికి సంక్షేమ పథకం అమలు చేసినా సరే.. బటన్ నొక్కడం ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసేది వైసీపీ ప్రభుత్వం. దీంతో ప్రతినెలా బటన్ నొక్కే కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. అయితే టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బటన్ నొక్కటం అనే ప్రక్రియ దాదాపుగా నిలిచిపోయిందనే చెప్పొచ్చు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేస్తోంది. ఇక ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు వంటి వాటిని ప్రజాప్రతినిధులే నేరుగా ప్రజలకు అందిస్తున్న పరిస్థితి.

పేదల సేవలో పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నెలా పింఛన్ల పంపిణీని చేపడుతున్నారు. రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటిస్తూ పేద ప్రజలకు పింఛన్లు అందిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరంలో పర్యటించారు చంద్రబాబు నాయుడు, చామవరంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు బటన్ నొక్కటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా బటన్ నొక్కవచ్చని.. కానీ, నేరుగా పేదవాడి ఇంటికి వచ్చి పింఛన్ అందించినప్పుడు, అధికారులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని పరిశీలించినప్పుడు కలిగే ఆనందం.. బటన్ నొక్కితే ఉండదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

గతంలో ఏదైనా కారణంతో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే.. వెంటనే రద్దు చేసేవారని చంద్రబాబు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల పింఛన్ ఒకేసారి తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి 3 లేదా 4 సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.

మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నామని వివరించారు. పీ4 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పేదలను ఆదుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందన్న చంద్రబాబు.. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రభుత్వంపై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి