Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

నిర్మాతల తప్పులు.. వాళ్లపై నిందలు..!

12 June 2026

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు.. ఇక నుంచి..!! | Central government restricts industrial users from buying petrol and diesel at retail pumps for 90 days

12 June 2026

కొత్త కుర్రాడి మీద కోటి బడ్జెట్ అవసరమా అన్నారు.. కట్ చేస్తే.. 2000లో బాక్సాఫీస్ షేక్.. 26 ఏళ్లుగా ట్రెండింగ్ మూవీ..

12 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pawan Kalyan On Telangana Politics,నా సభకు అనుమతి ఇచ్చి ఉంటే సాదాసీదాగా సాగిపోయేది.. పవన్ కళ్యాణ్ – ap deputy cm pawan kalyan on telangana politics at amarajeevi potti sriramulu statue in amaravati
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan On Telangana Politics,నా సభకు అనుమతి ఇచ్చి ఉంటే సాదాసీదాగా సాగిపోయేది.. పవన్ కళ్యాణ్ – ap deputy cm pawan kalyan on telangana politics at amarajeevi potti sriramulu statue in amaravati

.By .3 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pawan Kalyan On Telangana Politics,నా సభకు అనుమతి ఇచ్చి ఉంటే సాదాసీదాగా సాగిపోయేది.. పవన్ కళ్యాణ్ – ap deputy cm pawan kalyan on telangana politics at amarajeevi potti sriramulu statue in amaravati
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. తెలంగాణ రాజకీయాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన సభకు అనుమతి ఇచ్చి ఉంటే సాదాసీదాగా జరిగిపోయేదని అన్నారు. అమరావతిలోని అమరజీవి విగ్రహాన్ని సందర్శించిన అనంతరం విలేకర్లతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. తెలంగాణ ఆ ప్రాంత భూమిపుత్రులదేనని స్పష్టం చేశారు. జనసేనలోని తెలంగాణ భూమిపుత్రులు అక్కడ పోటీచేస్తామంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్ని్ంచారు. ప్రాంతీయ విద్వేషాలకు ముగింపు పలకాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.

pawan kalyan in Amaravati
అమరావతిలో పవన్ కళ్యాణ్(ఫోటోలు– Samayam Telugu)
తెలంగాణ రాజకీయాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. అమరావతిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్.. పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇంకా ప్రాంతీయ నినాదం ఉనికిలో ఉందన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో మాత్రం ఆంధ్ర అనే ఉనికి లేదన్నారు. హైదరాబాద్‌లో తన సమావేశానికి అనుమతి ఇచ్చి ఉంటే సాదాసీదాగా సాగిపోయేదని.. ఈ వివాదం తలెత్తేది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల గురించి తానెప్పుడూ చెడుగా మాట్లాడలేదని.. తెలంగాణ ప్రాంతం ఎప్పటికీ ఆ ప్రాంత భూమిపుత్రులదేనని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ భూమిపుత్రులే పోటీ చేస్తామంటే అభ్యంతరాలు ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ రియాక్షన్

మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా, నటుడిగా పవన్ కళ్యాణ్ అంటే తమకు గౌరవం ఉందని.. అయితే తెలంగాణ సచివాలయంలో కూర్చుని పెత్తనం చెలాయిస్తామంటే మాత్రం అంగీకరించమని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఆయన తనకు సోదరుడిలాంటి వారని అన్నారు. ఆయన ఏమన్నారో పూర్తిగా వినలేదని.. కచ్చితంగా తన గురించి తప్పుగా మాట్లాడి ఉండరని అభిప్రాయపడ్డారు. ఇక ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం, ప్రాంతీయవాదం వేర్వేరని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. విభజించుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తామని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి తెలంగాణలో ఎవరూ పోటీ చేయడం లేదన్న జనసేనాని.. జనసేనలోని తెలంగాణ భూమిపుత్రులే పోటీచేస్తామంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు.

తెలంగాణలోని నా ఇంటికి వెళ్లకూడదా.. పవన్ కళ్యాణ్

మరోవైపు తెలంగాణలో తనకు ఇల్లు ఉందన్న పవన్ కళ్యాణ్.. అక్కడికి కూడా వెళ్లకూడదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్ వెళ్లి పోటీ చేయొచ్చా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఘటనలు సీఎం రేవంత్ రెడ్డికి తెలిసి జరుగుతున్నాయని అనుకోవడం లేదన్నారు పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలే పనిగట్టుకుని విద్వేషాలు రేపుతున్నారని ఆరోపించారు. ప్రాంతీయ విద్వేషాలకు ముగింపు పలకాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి