
పెద్ద సంఖ్యలో ఆమె వద్దకు రావడం అందరూ వెళ్లడంతో తనకు ఇబ్బందులు తప్పలేదు. పూసలు, దండలు అమ్మేపని పక్కనపడిపోయింది. దీనిని తట్టుకోలేక తండ్రి ఆమెను సొంతూరు ఇండోర్ కు పంపేశారనే వార్తలు వెలువడ్డాయి. అలాంటిది ఇప్పుడు మోనాలిసా భోంస్లే మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. ఈసారి తమ ఊరిలో ఓ మేకప్ నిపుణురాలి దగ్గర మేకప్ వేయించుకుంటున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఎక్స్’లో పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటికే మిలియన్ మందికి పైగా వీక్షించారు.
