Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పెరిగిన వంటనూనెల ధరలు, గ్యాస్ సిలిండర్ల రేట్లు ఇక..!? | LPG Shock Likely: Domestic Cylinder Prices May Rise by ₹50 Soon as latest reports from oil companies

14 May 2026

రమా రాజమౌళి దగ్గర లక్ష అప్పు చేసిన టాలీవుడ్ డైరెక్టర్.. ఇప్పటికీ నో రిటన్

14 May 2026

CSK : అర్ధాంతరంగా ఐపీఎల్ వదిలి వెళ్లిన స్టార్ ప్లేయర్.. 2026లో సిఎస్‌కేకు ఘోర పరాభవం తప్పదా?

14 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd Trust Board To Meet On January 31st,టీటీడీ కీలక నిర్ణయం.. ఈ నెల 31న ఫిక్స్, మరోసారి ఆ తప్పు జరగకుండా ముందు జాగ్రత్త – ttd trust board to meet on january 31st to discuss on rathasapthami
ఆంధ్రప్రదేశ్

Ttd Trust Board To Meet On January 31st,టీటీడీ కీలక నిర్ణయం.. ఈ నెల 31న ఫిక్స్, మరోసారి ఆ తప్పు జరగకుండా ముందు జాగ్రత్త – ttd trust board to meet on january 31st to discuss on rathasapthami

.By .27 January 2025No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd Trust Board To Meet On January 31st,టీటీడీ కీలక నిర్ణయం.. ఈ నెల 31న ఫిక్స్, మరోసారి ఆ తప్పు జరగకుండా ముందు జాగ్రత్త – ttd trust board to meet on january 31st to discuss on rathasapthami
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Trust Board To Meet: ఈనెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసరంగా సమావేశం కానుందని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. రథసప్తమి సందర్భంగా ఏర్పాట్లపై టీటీడీ సభ్యులు, అధికారులతో పాలక మండలి సమీక్షించనున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. భక్తులకు సౌకర్యాలపై అధికారులకు టీటీడీ ఛైర్మన్‌ సూచనలు చేయనున్నారు. రథసప్తమి రోజున ఏడు వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. తిరుపతి ఘటన దృష్ట్యా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని.. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దుపై టీటీడీ ఇప్పటి ప్రకటన చేసింది.

హైలైట్:

  • ఈ నెల 31న టీటీడీ పాలకమండలి భేటీ
  • అత్యవసరంగా సమావేశమవుతున్న బోర్డ్
  • రథసప్తమి వేడుకలపై చర్చించనున్నారు
Samayam Teluguరథసప్తమి కోసం టీటీడీ పాలకమండలి భేటీ
రథసప్తమి కోసం టీటీడీ పాలకమండలి భేటీ

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ కౌంటర్ దగ్గర.. తిరుపతి తొక్కిసలాట ఘటనతో టీటీడీ అప్రమత్తమైంది. ఈ నెల 31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 4న రథసప్తమిని పురస్కరించుకొని పాలకమండలి భేటీ కానుంది.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్వర్యంలో రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో క్షేత్రస్థాయి సమీక్ష చేయనున్నారు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివనున్నారు. జనవరి 8న‌ తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకొని అధికారులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఫిబ్రవరి 4న పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు, అన్ని ప్రివిలైజ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

తిరుమలలో శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో జ‌న‌వరి 28 నుంచి 30వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండ‌పంలో ఘ‌నంగా జరుగనున్నాయి. మొదటిరోజైన జ‌న‌వరి 28న ఉదయం సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగరసంకీర్తన కార్యక్రమాలు, పురంద‌ర సాహిత్య‌ గోష్ఠి, వివిధ పీఠాధిపతుల మంగళాశాసనాలు, మధ్యాహ్నం సంకీర్తనమాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్ర‌ముఖ పీఠాధిప‌తులు మంగ‌ళా శాస‌న‌ములు అందిస్తారు.

రెండవ రోజైన జ‌న‌వరి 29న ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పురందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం నుండి నారాయణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్‌సేవ, దాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి. చివరిరోజు జ‌న‌వరి 30న ఉదయం సుప్ర‌భాతం, ధ్యానం, సామూహిక భ‌జ‌న‌, న‌గ‌ర సంకీర్త‌న, హరిదాస రసరంజని కార్యక్రమాలు నిర్వహిస్తారు. జ‌న‌వ‌రి 28న తిరుప‌తిలో “హ‌రిదాస రంజ‌ని”.. జ‌న‌వ‌రి 28న తిరుప‌తిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో “హ‌రిదాస రంజ‌ని” గోష్టిగానం నిర్వ‌హించ‌నున్నారు.

శ్రీ గోవింద‌రాజస్వామి వారి ఆల‌యంలో అధ్య‌య‌నోత్స‌వాలు

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జ‌న‌వ‌రి 28 నుండి ఫిబ్ర‌వ‌రి 20వ తేదీ వ‌ర‌కు అధ్యయనోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ప్ర‌తి ఏడాదీ ఆలయంలో అధ్య‌య‌నోత్స‌వాల సంద‌ర్భంగా దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ రాత్రి 7.15 నుంచి 8.15 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 7న చిన్నశాత్తుమొర, ఫిబ్ర‌వ‌రి 13న ప్రణయ కలహోత్సవం, ఫిబ్ర‌వ‌రి 17న పెద్దశాత్తుమొర నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Govt Employees Work From Home,ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్.. వారికి మాత్రమేనా ? సీఎం చంద్రబాబు కీలక ప్రకటన – ap cm chandrababu naidu comments on work from home for government employees

14 May 2026

గడ్డి కోస్తుండగా రైతుకు కనిపించిన గూడు.. లోపల ఏముందా అని చూడగా..

14 May 2026

Pawan Kalyan Reduced Convoy Vehicles,సీఎం చంద్రబాబు బాటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తప్పదు మరి, పరిస్థితులు అలా ఉన్నాయి – andhra pradesh cm chandrababu naidu and deputy cm pawan kalyan orders to reduce vehicles in their convoy

14 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పెరిగిన వంటనూనెల ధరలు, గ్యాస్ సిలిండర్ల రేట్లు ఇక..!? | LPG Shock Likely: Domestic Cylinder Prices May Rise by ₹50 Soon as latest reports from oil companies

14 May 2026

పెరిగిన వంటనూనెల ధరలు, గ్యాస్ సిలిండర్ల రేట్లు ఇక..!? | LPG Shock Likely: Domestic Cylinder Prices May…

రమా రాజమౌళి దగ్గర లక్ష అప్పు చేసిన టాలీవుడ్ డైరెక్టర్.. ఇప్పటికీ నో రిటన్

14 May 2026

CSK : అర్ధాంతరంగా ఐపీఎల్ వదిలి వెళ్లిన స్టార్ ప్లేయర్.. 2026లో సిఎస్‌కేకు ఘోర పరాభవం తప్పదా?

14 May 2026

Ap Govt Employees Work From Home,ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్.. వారికి మాత్రమేనా ? సీఎం చంద్రబాబు కీలక ప్రకటన – ap cm chandrababu naidu comments on work from home for government employees

14 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పెరిగిన వంటనూనెల ధరలు, గ్యాస్ సిలిండర్ల రేట్లు ఇక..!? | LPG Shock Likely: Domestic Cylinder Prices May Rise by ₹50 Soon as latest reports from oil companies

14 May 2026

రమా రాజమౌళి దగ్గర లక్ష అప్పు చేసిన టాలీవుడ్ డైరెక్టర్.. ఇప్పటికీ నో రిటన్

14 May 2026

CSK : అర్ధాంతరంగా ఐపీఎల్ వదిలి వెళ్లిన స్టార్ ప్లేయర్.. 2026లో సిఎస్‌కేకు ఘోర పరాభవం తప్పదా?

14 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025508

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025469

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.