Andhra Pradesh Tidco Houses On February 1st: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1.14 లక్షల గృహ నిర్మాణాలు పూర్తికాగా.. ఫిబ్రవరి 1న వాటిని ప్రారంభించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తేతలిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. లబ్ధిదారుల చేతికి ఇంటి తాళాలు అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఆ రోజున ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నరు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైలైట్:
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఫిబ్రవరి 1న టిడ్కో ఇళ్లు ప్రారంభిస్తారు
- తణుకులో చంద్రబాబు చేతుల మీదుగా

మరోవైపు ఏపీ ప్రభుత్వం మరికొన్ని టిడ్కో ఇళ్లను కూడా ఈ ఏడాదిలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని భావిస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి మరికొన్ని ఇళ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని టార్గెట్ పెట్టుకున్నారు. గత ప్రభుత్వం బ్యాంకు నుంచి రుణాలు తీసుకురాగా.. రూ.150 కోట్లు బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్ల సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి పీఎంఏవై కింద 7 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పీఎంఏవై రెండో విడతలో 6 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్నెల్లలో రూ.502 కోట్లు ఖర్చు చేసింది.


