Amaravati International Cricket Stadium: ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతోందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. అమరావతిలోని స్పోర్ట్స్ సిటీలో ఈ స్టేడియంను ప్లాన్ చేస్తున్నామని.. దేశంలోనే అతిపెద్ద స్టేడియంను ప్లాన్ చేస్తున్నామన్నారు. 1.25 లక్షల సీట్ల కెపాసిటీతో నిర్మించాలని అనుకుంటున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా మూడు క్రికెట్ అకాడమీలను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అక్కడ టీమిండియాకు ఆడిన ప్లేయర్లతో శిక్షణ ఉంటుందని చెప్పారు.
హైలైట్:
- ఏపీలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం
- అమరావతిలో ప్లాన్ చేస్తున్నారు
- 1.25 లక్షల సీట్ల కెపాసిటీతో గ్రౌండ్

ఏసీఏ తరఫున త్వరలో ఏపీఎల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పారు శివనాథ్. ఈ నెలాఖరులో విజయనగరంలో క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తామని.. .50 కోట్లతో విశాఖపట్నం స్టేడియంలో ఆధునికీకరణ పనులు చేపడతామన్నాారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రూ.90 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ గ్రౌండ్ పనులు చేపట్టి 50 శాతానికిపైగా పూర్తి చేసిందన్నారు. గత ప్రభుత్వం ఈ స్టేడియాన్ని పట్టించకోలేదనే విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేడియం పనులపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రికెట్ స్డేడియం పనుల్ని వేగవంతం చేసింది.


