Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అబుదాబి వేదికగా భారత్‌కు బిగ్ డీల్స్: రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు !! | pm Modi UAE Visit details that Strengthens Strategic And Economic Ties also 5 billion investments

15 May 2026

LSG vs CSK IPL 2026 Result: ఏడు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విన్..

15 May 2026

Parenting Tips: పిల్లల భవిష్యత్తును మార్చే తండ్రుల సూపర్ హ్యాబిట్స్.. ఇవి మీలో ఉన్నాయా?

15 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pawan Kalyan Letter To Janasena Cadre,పొరపాటున కూడా ఆ తప్పు చేయొద్దు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ – pawan kalyan open letter to janasena party followers
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan Letter To Janasena Cadre,పొరపాటున కూడా ఆ తప్పు చేయొద్దు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ – pawan kalyan open letter to janasena party followers

.By .27 January 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pawan Kalyan Letter To Janasena Cadre,పొరపాటున కూడా ఆ తప్పు చేయొద్దు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ – pawan kalyan open letter to janasena party followers
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Pawan Kalyan Letter To Janasena Followers: ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులను ఉద్దేశించి కొన్ని సూచనలు చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ.. ఎన్డీఏ కూటమి అంతర్గత విషయాలపై కానీ.. పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా వారి వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పొద్దన్నారు.

హైలైట్:

  • జనసైనికులకు, వీర మహిళలకు పవన్ కళ్యాణ్ లేఖ
  • మూడు పార్టీలు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు
  • బహిరంగంగా చర్చించొద్దని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
Samayam Teluguపవన్ కళ్యాణ్ లేఖ
పవన్ కళ్యాణ్ లేఖ

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసైనికులకు బహిరంగ లేఖ రాశారు. జనసేన పార్టీ నేతలు, వీరమహిళలు, జనసైనికులు.. ఎవరూ అనవసరమైన వివాదాలు, విభేదాల జోలికి వెళ్లొద్దన్నారు. ఎన్డీయే కూటమిలోని మూడు పార్టీల కేడర్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. కూటమి ఆశయాన్ని గమనించి ముందుకు సాగాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గతమైన అంశాలపై ఒకవేళ ఎవరైనా స్పందించినా.. ప్రతి స్పందించొద్దన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించొద్దు.. బహిరంగంగా చర్చించొద్దని సూచించారు పవన్ కళ్యాణ్.ఆ లేఖలో.. ‘2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ – టీడీపీ – బీజేపీ ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం, ఇది కేవలం ఒక్క కూటమి బల౦ మాత్రమే కాదు, గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహక చర్యలపై, చట్ట సభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫ్యల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావులేకుండా రాష్ట్రాన్ని తిరోగమన౦ పాలు చేసి, అప్పుల ఆ౦ధ్రప్రదేశ్‌‌గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు, సుస్థిరమైన ప్రభుత్వం కోస౦, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవ౦ కలిగిన పాలన, భావి తరాల భవిష్యత్తు గురి౦చి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో, కూటమిపై నమ్మకంతో ప్రజలు 94% విజయంతో 164/175 స్థానాలను ఎన్డీఏ కూటమికి, 100% స్టైక్‌ రేట్‌ తో పోటీ చేసిన 21/21 అసెంబ్లీ స్థానాలు, 2/2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించారు’అన్నారు.

‘ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలచుకుని అధికార౦ చేపట్టిన రోజు నుంచి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, కేంద్ర సహాయ, సహకారాలతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి సాధి౦చే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అధికార౦ చేపట్టిన 7 నెలల కాల౦లో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నా, మారుమూల గ్రామాలలో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన
జరుగుతున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, సంక్షేమాన్ని – అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకుకెళ్తున్నా సరే దానంతటికి కారణ౦ 5 కోట్ల ఆ౦ధ్రప్రదేశ్‌ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని, యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే ధృఢ సంకల్పమే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది’ అన్నారు.

‘అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ, పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే, దయచేసి ఎవరూ కూడా ప్రతి స్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం కానీ, బహిర౦గ౦గా చర్చించడ౦ కానీ చేయవద్దు. ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో, 2047 నాటికి స్వర్ణ ఆ౦ధ్ర సాధించి, వికసిత్‌ భారత్‌ సాధనలో 2.5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసి కట్టుగా పని చేస్తున్న సందర్భంలో ప్రతీ ఒక్కరూ చేయీ, చేయీ కలిపి నడవాల్సిన అవసర౦ ఉంది. నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను, నాకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవటం, వారికి అండగా నిలబడటం, నేను పుట్టిన నేలను అభివృద్ది చేయాలనుకోవడం మాత్రమే. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, మార్చి 14 న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాలు గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను’అన్నారు పవన్ కళ్యాణ్.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Weather Update May 16th,ఇదేం వాతావరణం బాబోయ్.. మాడుపగిలేలా ఎండలు, మరోవైపు వానలు.. – apsdma weather update rain with thunders in andhra pradesh on may 16th 2026

15 May 2026

Pawan Kalyan On Ysrcp,ఈ మధ్య కొందరికి ప్రేమలు ఎక్కువయ్యాయి.. నేను కాపుల కోసమే రాలేదు: పవన్ కళ్యాణ్ – ap deputy cm pawan kalyan on ysrcp in janasena meeting mangalagiri

15 May 2026

Andhra News: ఉదయానే పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంటికొచ్చి చూడగా..

15 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అబుదాబి వేదికగా భారత్‌కు బిగ్ డీల్స్: రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు !! | pm Modi UAE Visit details that Strengthens Strategic And Economic Ties also 5 billion investments

15 May 2026

అబుదాబి వేదికగా భారత్‌కు బిగ్ డీల్స్: రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు !! | pm Modi UAE…

LSG vs CSK IPL 2026 Result: ఏడు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విన్..

15 May 2026

Parenting Tips: పిల్లల భవిష్యత్తును మార్చే తండ్రుల సూపర్ హ్యాబిట్స్.. ఇవి మీలో ఉన్నాయా?

15 May 2026

Video: శాంసన్, గైక్వాడ్‌లకు ఇచ్చిపడేసిన ఆకాష్ సింగ్.. వినూత్న వేడుకతో సంచలనం.. ఆ స్లిప్‌లో ఏముందంటే?

15 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అబుదాబి వేదికగా భారత్‌కు బిగ్ డీల్స్: రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు !! | pm Modi UAE Visit details that Strengthens Strategic And Economic Ties also 5 billion investments

15 May 2026

LSG vs CSK IPL 2026 Result: ఏడు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విన్..

15 May 2026

Parenting Tips: పిల్లల భవిష్యత్తును మార్చే తండ్రుల సూపర్ హ్యాబిట్స్.. ఇవి మీలో ఉన్నాయా?

15 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025514

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025473

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.