Andhra Pradesh Shopping Malls Smoke Extraction System: ఏపీలో అగ్నిమాపకశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా షాపింగ్ మాల్స్ భవనాల్లో విద్యుత్ నిర్వహణ, స్మోక్ ఎక్స్‌ట్రాక్షన్ సిస్టమ్‌పై కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనల్ని పాటించాలని సూచించారు. భవనాల యాజమాన్యాలు మార్గదర్శకాలు పాటించాలి అన్నారు. ఇటీవల జరిగిన ఘటనలతో అగ్నిమాపకశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి అగ్నిప్రమాదాలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.
హైలైట్:
- ఏపీలో షాపింగ్స్ మాల్స్‌కు కీలక సూచనలు
- విద్యుత్ నిర్వహణ, స్మోక్ ఎక్స్‌ట్రాక్షన్ సిస్టమ్
- కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు

మాల్స్ ఉన్న భవనాల్లో ఏసీ డక్ట్‌ల ద్వారా భవనంలోని ఇతర భాగాలకు పొగ వ్యాపించకుండా చూసుకోవాలని సూచనలు చేశారు. ఈ మేరకు భవనంలోని అన్ని ఫ్లోర్లలో స్మోక్ ఎక్స్‌ట్రాక్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి.. ఒకవేళ పొగ వస్తే, ఆ స్థానంలో గంటకు కనీసం 12సార్లు తాజా గాలిని ఫ్రెష్‌గా గాలిని భర్తీ చేసే ఒక సిస్టమ్ ఉండాలి. ఆయా సందర్భాల్లో మెట్ల మార్గంలోకి పొగ వ్యాపించదు కాబట్టి భవనంలో చిక్కుకున్న వారు ఆందోళనలో ఉంటారు. అందుకే భవనంలోని అన్ని ఫ్లోర్లలో అలారమ్, అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ఉండాలి. ఈ అనౌన్స్‌మెంట్ వ్యవస్థ ఉంటే భవనంలో చిచ్కుకున్న వారు జాగ్రత్తగా బయటకు వెళ్లేలా సూచనలు చేసే అవకాశం ఉంటుంది.
భవనంలో అగ్ని ప్రమాదం జరిగితే ముందుగాజజ వృద్ధులు, దివ్యాంగులను తరలించడానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులు సూచించారు. ప్రతి అంతస్తులోనూ కనీసం ఒక బయటవైపుకు మెట్లమార్గం, పొగ బయటకు వెళ్లే మార్గాలు ఉండాలి అంటున్నారు. మాల్స్ ఉండే భవనాల్లో షార్ట్ సర్క్యూట్, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఎంసీబీ (మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్)లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి అన్నారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌ఎస్ కేబుల్స్‌ను ఉపయోగించాలి.. అన్ని ఎలక్ట్రికల్ ప్యానళ్లలో సీవో2/ క్లీన్ ఏజెంట్/ ఏరోసోల్ ఆటోమేటిక్ ఫ్లడింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయాలని కూడా సూచనలు చేశారు. మాల్స్ ఏర్పాటు చేసిన భవనాలు ఈ మార్గదర్శకాలను పాటించాలని సూచిస్తున్నారు.


