Tirumala Lady Devotee Pant T Shirt Vip Break Darshan: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు, భక్తురాలు, పిల్లలు సాంప్రదాయ దుస్తుల్లో వస్తారు. కానీ ఓ మహిళా భక్తురాలు మాత్రం ప్యాంట్, టీషర్ట్ ధరించి దర్శనానికి రావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మహిళా భక్తురాలు టీషర్ట్, ప్యాంట్‌లో స్వామిని దర్శించుకుని బయటకు వచ్చారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
హైలైట్:
- తిరుమల శ్రీవారి దర్శనానికి ప్యాంట్, టీషర్ట్
- టీటీడీ సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నాయి
- ప్యాంట్, టీషర్ట్‌తో దర్శనానికి అనుమతి ఎలా

టీటీడీ 2013 నుంచి తిరుమలలో డ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తోంది. ఆ నిబంధనల ప్రకారం.. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్ ప్రత్యేక దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. మగవారైతే.. షర్ట్, పంచె, పైజమాతో రావాల్సి ఉంటుంది.. మహిళలు చీర, చుడిదార్, హాఫ్ శారీలో రావాల్సి ఉంటుంది.
ప్రయాగ్ రాజ్ లో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
మహా కుంభమేళా సందర్భంగా దేవరియాలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర దేవస్థానంవారు ప్రయాగ్ రాజ్ లోని సెక్టార్-8లో ఏర్పాటు చేసిన భక్తి వాటికా సేవా శిబిరంలో ఆదివారం శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చుకులు శ్రీ రాజేష్ దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు.
అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలయిన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు.
చివరిగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించడం తో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు. ఈ కార్యక్రమంలో జగద్గురు శ్రీరామానుజాచార్యస్వామి రాజనారాయణాచార్య, హెచ్ డీపీపీ అడిషనల్ సెక్రటరీ రామ్ గోపాల్, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, బొక్కసం ఇంఛార్జ్ గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


