మరికొందరు ఇనుప స్తంభాల కింద ఇరుక్కోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇనుప స్తంభాలను తొలగించి మృతులను వెలికి తీయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇనుప రాడ్లతో వెళుతున్న లారీ ఆటోను ఓవర్టేక్ చేయబోయి బోల్తా కొట్టినట్టు, దీంతో అందులో ఉన్న ఇనుప రాడ్లు ఆ రోడ్డుపై వెళ్తున్న ఆటోల పైన పడినట్టు స్థానికులు చెబుతున్నారు. మృతి చెందిన దినసరి కూలీలను మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. అయితే లారీని నడిపిన డ్రైవర్ మద్యం సేవించి ఉండడం ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మామునూరు రోడ్డుపై జరగడంతో వరంగల్ ఖమ్మం రహదారి పైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై అడ్డంగా పడిన ఇనుప స్తంభాలను జెసిబి ల సహాయంతో తొలగించారు.

