అయితే పురుషులు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవచ్చు. కానీ వేసెక్టమీ ఆపరేషన్లకు పురుషులు దూరంగా ఉంటున్నారు. ఎక్కడో ఒక చోట పురుషులు వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అయితే వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకునేందుకు డాక్టర్లను సంప్రదిస్తారు. కానీ ఓ పురుషుడు స్వయంగా తనకు తానే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇది తన భార్యకు బహుమతి అని ఆ డాక్టర్ చెప్పుకొచ్చాడు. తన వేసెక్టమీ ఆపరేషన్‌ను వీడియోగా చిత్రీకరించి.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

