TTD Review On Summer Arrangements: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ రిలీఫ్ ఇఛ్చింది. రానున్న వేసవిలో భక్తుల సౌకర్యార్థం తిరుమలలో చేపట్టాల్సిన సౌకర్యాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్షించారు. భక్తులతో రద్దీని దృష్టిలో ఉంచుకుని మొదటి ఘాట్‌రోడ్డులోని అక్కగార్ల గుడి, శ్రీవారి సేవాసదన్, తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని అధికారుల్ి ఆదేశించారు. అంతేకాదు భక్తులకు అవసరమైన లడ్డూల బఫర్ స్టాక్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తగినన్ని నిల్వ ఉంచుకోవాలని సూచించారు.
హైలైట్:
- తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ రిలీఫ్
- కొండపై ఆ సమస్యకు టీటీడీ చెక్
- టీటీడీ ఏఈవో సమీక్ష నిర్వహించారు

టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు
టీటీడీ ఉద్యోగుల వార్షిక ఆటల పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 28 శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానంలో క్రీడల ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ పోటీలు మార్చి 17 తేదీ వరకు జరుగనున్నాయి.మొదటి రోజు ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్‌లు, పోటీ షెడ్యూల్ తదితర వివరాలు తెలియజేయడం జరుగుతుంది. పురుషులకు, మహిళలకు వేరువేరుగా, ప్రత్యేక ప్రతిభావంతులకు, సీనియర్ అధికారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు పోటీలను నిర్వహిస్తారు. ఇందులో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, షటిల్, టెన్నిస్ తదితర క్రీడలు ఉన్నాయి. పరేడ్ మైదానంతో పాటు రిక్రియేషన్ హాల్, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ మైదానం, ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్వీ హైస్కూల్ మైదానం, ఎస్వీ యూనివర్శిటీ, ఎస్వీ అగ్రికల్చర్, వెటనరీ యూనివర్శిటీ మైదానంలో ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహిస్తారు. టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈఓ శ్రీ. ఏ. ఆనంద రాజు క్రీడల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
చిన్నశేష వాహన సేవ
జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ పాండురంగస్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి రెండో రోజు ఉదయం శ్రీ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తారు.


