422 మీటర్ల హైపర్‌లూప్ ట్రాక్‌ను రెడీ చేసింది. హైపర్‌లూప్ అంటే సుదూర మార్గాల్లో వేగంగా ప్రయాణించేందుకు తయారుచేసిన హైస్పీడ్ ట్రాక్ అని అర్థం. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యుదయస్కాంత ట్రాక్‌ను తయారుచేస్తారు. ఒక ప్రత్యేకమైన ట్యూబ్‌లో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ఈ హైపర్‌లూప్‌లో రైళ్లు ప్రయాణిస్తాయి. ఈ ప్రయోగాల కోసం ఇప్పటికే IIT మద్రాస్‌కు రైల్వేశాఖ 17.5 కోట్ల రూపాయలను రెండు విడతలుగా ఇచ్చింది. మూడో విడతలో మరో 8 కోట్ల రూపాయలను ఇవ్వబోతున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఐదవ రవాణా విధానం’గా పిలిచే హైపర్‌లూప్ అనేది సుదూర ప్రయాణానికి ఉపయోగించే హై-స్పీడ్ రవాణా వ్యవస్థ. ఇక చైనాలో కూడా హైపర్‌లూర్ ప్రాజెక్టు జోరుగా సాగుతోంది. ఈ విషయంలో మనకన్నా డ్రాగన్ కంట్రీ అడ్వాన్స్‌గా ఉంది. ఇప్పటికే చైనాలో హైపర్‌లూప్ ట్యూబ్ సిద్ధమైంది. భవిష్యత్ అంతా ఇదే అంటున్నారు. వాస్తవానికి హైపర్‌లూప్ ప్రాజెక్టును ఎలాన్ మస్క్ చేపట్టాలని భావించినట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద మస్క్ రాకెట్లపై దృష్టిపెడితే, భారత్-చైనా భూమ్మీద ఈ హైపర్‌లూప్ ప్రాజెక్టును చేపడుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో

