పూల్ మఖానాలో ఉండే పైబర్ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరిచి, మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. అంతేకాదు పూల్ మఖానాలో యాంటీ ఏజింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే అమినో యాసిడ్స్ చర్మంపై వచ్చే ముడుతల్ని, మొటిమల్ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే కాల్షియంతో ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. ఎదిగే పిల్లలకు ఇది మంచి పోషకాహారంగా నిపుణులు చెబుతారు. పిల్లలకు నచ్చేలా దీంతో చాట్ మిక్చర్ కూడా చేసిపెట్టొచ్చు. 100 గ్రాముల మఖానా తింటే శరీరానికి 340 గ్రాముల కేలరీలు అందుతాయి. వీటిలో ఫ్యాట్స్ శాతం అసలు ఉండదు, కనుక బరువు పెరుగుతారనే భయంలేదు. రోజులో 30 గ్రాముల వరకూ మఖానా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో భావోద్వేగాలు, ఒత్తిడి అదుపులో ఉంటాయి. రక్తపోటు తగ్గుతుంది. వీటిలో రక్తాన్ని శుద్ధిచేసే డిటాక్సిఫైయింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అవి శరీరంలో ఉన్న మలినాల్ని బయటకు పంపుతాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ వాపు, నొప్పి సమస్యలను తగ్గిస్తాయి.
మరిన్ని వీడియోల కోసం :
బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో

