ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు, ప్రయాగ్‌రాజ్ మేయర్ గణేశ్ కేసర్వాని, మహాకుంభ్ ప్రత్యేక ఈవో ఆకాంక్ష రాణా పర్యవేక్షించారు. రికార్డుకు సంబంధించిన తుది నివేదిక మూడు రోజుల్లో వెలువడనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక, 2019లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. మహా కుంభమేళా జనవరి 13న మొదలుకాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇప్పటివరకు పవిత్ర త్రివేణి సంగమంలో 60 కోట్లకు మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రాక మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో

