ఆమె వరుడి చొక్కాపట్టుకొని నిలదీస్తోంది. పెళ్లిమండపంలోని వారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వివాహ కార్యక్రమంలో సూటు, బూటు వేసుకొని పెళ్లి దుస్తులతో ఆనందంలో తేలిపోతున్నాడు వరుడు. తనదైన స్టైల్లో ఫోటోలకు ఫోజులిస్తున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ మహిళ వరుడి చొక్కాపట్టుకొని ఏదో విషయమై అతడ్ని నిలదీస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక బంధువులంతా తెల్లమొహం వేసుకొని చూస్తున్నారు. వరుడు ఎంతగా విడిపించుకోవాలనుకున్నా ప్రియురాలు వదల్లేదు. ఇంతలో అక్కడున్న వరుడి బంధువులు ఆమెకు సర్ధిచెప్పి వేదికపైనుంచి కిందకు పంపించారు. అయినా ఆమె వరుడివైపు చేయి చూపిస్తూ హెచ్చరిస్తూనే ఉంది. ఈ వీడియోలో ఇంతవరకే ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియలేదు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే 8 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. లక్షలాది మంది లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఆమెను చూసి భయపడుతున్నాడంటే వరుడిదే తప్పు అయి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్.. నగరంలో మటన్, ఫిష్ ధరలు ఏంటి ఇంత పెరిగాయి
మగ పోలీసులకు మేకప్‌లో ట్రైనింగ్ ఐబ్రోస్, మాయిశ్చరైజింగ్ లో మెళకువలు
రోడ్డుపై వెళ్తుండగా వినికిడిని కోల్పోయిన ఆటో డ్రైవర్! ఏం జరిగిందంటే ??
నదిలో స్నానం చేస్తుండగా కాళ్ల కింద ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా.. షాక్ !!
ప్రియుడి కోసం ప్రియురాళ్ల మధ్య పోటీ.. విషం తీసుకొని…

