Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Virat Kohli : ‘ఎప్పటికైనా ముగియాల్సిందే!’.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్

14 May 2026

Milk Price Hike: సామాన్యులకు పాల సెగ.. భారీగా పెరిగిన ధరలు, నేటి నుంచే కొత్త రేట్లు!

14 May 2026

NEET vs JEE: నీట్ లీకేజీ కారణాలు.. జేఈఈ విజయ రహస్యాలు

14 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Actor Posani Krishna Murali Remand Report,Posani Krishna Murali: పోసాని రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..! – actor posani krishna murali remand report details
ఆంధ్రప్రదేశ్

Actor Posani Krishna Murali Remand Report,Posani Krishna Murali: పోసాని రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..! – actor posani krishna murali remand report details

.By .28 February 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Actor Posani Krishna Murali Remand Report,Posani Krishna Murali: పోసాని రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..! – actor posani krishna murali remand report details
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఓబుళాపురం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్డు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. ఇక పోసాని కృష్ణ మురళి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయి. వర్గాలు, కులాలపై తాను తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు పోసాని అంగీకరించారని సమాచారం. వైసీపీకి చెందిన ముఖ్య నేత సూచనల మేరకే విమర్శలు చేశానని పోసాని పోలీసులతో చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది.

Samayam Telugu: పోసాని రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..!
: పోసాని రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..!

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోసాని కృష్ణ మురళి కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును పోలీసులు రైల్వే కోడూరు కోర్టుకు సమర్పించారు. పోసాని కృష్ణ మురళి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కులాలు, వర్గాలపై గతేడాది తాను తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు పోసాని కృష్ణ మురళి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించినట్లు తెలిసింది. అలాగే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కుటుంబ సభ్యులను కూడా దూషించినట్లు పోసాని అంగీకరించారని సమాచారం. వైసీపీకి చెందిన ఓ ముఖ్య నేత స్క్రిప్ట్ మేరకే తాను విమర్శలు చేశానని పోసాని కృష్ణ మురళి చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అలాగే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వైసీపీకి మద్దతుగా పనిచేశానని పోసాని కృష్ణ మురళి చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

మరోవైపు రాజకీయ పార్టీలు, అభిమానులు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో మార్చి 12 వరకు పోసాని కృష్ణ మురళి రాజంపేట సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉండనున్నారు. మరోవైపు పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లె పోలీసులు రైల్వే కోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోసాని కృష్ణ మురళిని సమగ్ర విచారణ చేయాల్సి ఉందని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోసానిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే పోలీసుల పిటిషన్‌ను రైల్వే కోడూరు కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై 14 కేసులు నమోదైనట్లు తెలిసింది. ఇందులో నాలుగు కేసులలో పోసాని కృష్ణ మురళికి వ్యతిరేకంగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. మరోవైపు పోసాని కృష్ణ మురళిని బుధవారం హైదరాబాదులో అరెస్టు చేసిన సమయంలో అరెస్ట్ ఇంటిమేషన్ కాపీని పోసాని కృష్ణ మురళి కుటుంబ సభ్యులు తీసుకోలేదు. దీంతో పోసాని కృష్ణ మురళి తనయుడికి అరెస్ట్ ఇంటిమేషన్ కాపీని వాట్సాప్ ద్వారా పంపించినట్లు పోలీసులు రైల్వే కోడూరు కోర్టుకు తెలిపారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Tet Mandatory For Teachers Promotions,ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు – andhra pradesh school education department orders on tet mandatory for teachers promotions

14 May 2026

Ap Govt Employees Work From Home,ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్.. వారికి మాత్రమేనా ? సీఎం చంద్రబాబు కీలక ప్రకటన – ap cm chandrababu naidu comments on work from home for government employees

14 May 2026

గడ్డి కోస్తుండగా రైతుకు కనిపించిన గూడు.. లోపల ఏముందా అని చూడగా..

14 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Virat Kohli : ‘ఎప్పటికైనా ముగియాల్సిందే!’.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్

14 May 2026

Virat Kohli : భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన కెరీర్ ముగింపు దశపై మనసులో మాట బయటపెట్టారు.…

Milk Price Hike: సామాన్యులకు పాల సెగ.. భారీగా పెరిగిన ధరలు, నేటి నుంచే కొత్త రేట్లు!

14 May 2026

NEET vs JEE: నీట్ లీకేజీ కారణాలు.. జేఈఈ విజయ రహస్యాలు

14 May 2026

OTT Movie : IMDB 7.4 రేటింగ్‌.. వణికిస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఏకంగా ఆరు ఓటీటీల్లో

14 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Virat Kohli : ‘ఎప్పటికైనా ముగియాల్సిందే!’.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్

14 May 2026

Milk Price Hike: సామాన్యులకు పాల సెగ.. భారీగా పెరిగిన ధరలు, నేటి నుంచే కొత్త రేట్లు!

14 May 2026

NEET vs JEE: నీట్ లీకేజీ కారణాలు.. జేఈఈ విజయ రహస్యాలు

14 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025510

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025470

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.