Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

టాప్ హీరోయిన్లకు టెన్షన్ పెడుతున్న కొత్త బ్యూటీస్.. స్టార్ స్టేటస్ కోసం గట్టి పోటీ

18 May 2026

Vastu Tips: ఏ దిశలో కూర్చుని భోజనం చేస్తే అదృష్టం మీ వెంట నడుస్తుందో తెలుసా?

18 May 2026

Varanasi: మార్పుల్లేవు.. వారణాసిలో అది ఫిక్స్..! ఎలా ముగిస్తారోనని ఫ్యాన్స్ టెన్షన్

18 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Men Scheme,AP Govt: పురుషులకు శుభవార్త అందించిన ఏపీ ప్రభుత్వం.. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం – male self-help groups in andhra pradesh, men can get bank loans and self employment opportunities
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Men Scheme,AP Govt: పురుషులకు శుభవార్త అందించిన ఏపీ ప్రభుత్వం.. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం – male self-help groups in andhra pradesh, men can get bank loans and self employment opportunities

.By .28 February 2025No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Men Scheme,AP Govt: పురుషులకు శుభవార్త అందించిన ఏపీ ప్రభుత్వం.. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం – male self-help groups in andhra pradesh, men can get bank loans and self employment opportunities
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Male Self-Help Groups in AP: మహిళల పొదుపు సంఘాలను, డ్వాక్రా గ్రూపులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటినుంచో ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళా పొదుపు సంఘాల తరహాలో పురుషుల కోసమూ పొదుపు సంఘాలను ఏర్పాటు చేయనుంది. చంద్రబాబు నాయుడు సర్కార్ ఏప్రిల్ 1 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఇందులో ఎలాంటి వారు చేరవచ్చు? అర్హతలేమిటి? కీలక వివరాలు..

Samayam Teluguఏపీలో పురుషులకు పొదుపు సంఘాలు
ఏపీలో పురుషులకు పొదుపు సంఘాలు

మహిళా సంక్షేమం కోసం తెలంగాణ, ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. వారికి స్వయం ఉపాధి కల్పించడంతో పాటు.. ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో పొదుపు సంఘాలకు రుణాలను మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లుగానే ఏపీలో పురుష కార్మికులకు కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు కానున్నాయి. వీరికి కూడా రుణాలను మంజూరు చేయనున్నారు.

1982లో ప్రారంభించిన డ్వాక్రా పథకం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంత మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో తోడ్పాటును అందిస్తోంది. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడమే కాకుండా.. స్వయం ఉపాధి అవకాశాలను ఈ పథకం కల్పిస్తుంది. ఈ పథకంలో మహిళలకు చాలా తక్కువ వడ్డీతో రుణాలను మంజూరు చేస్తారు.

దీని మాదిరిగానే పట్టణాల్లో అసంఘటిత రంగంలో పనిచేసే పురుషుల కోసం స్వయం శక్తి బృందాలు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం రుణాలను అందించనుంది. దీనిలో భాగంగానే పురుషుల కోసం ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.

దేశవ్యాప్తంగా ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నంలో ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద 2,841 గ్రూపులను ఏర్పాటు చేసినట్లు మెప్మా అధికారులు పేర్కొన్నారు. NULM (నేషనల్ అర్బన్ లైవ్‌లీవుడ్ మిషన్) 2.0 కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం.. మహిళలు ఎలాగైతే స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందుతున్నారో.. అలానే పురుషులకు కూడా రుణాలను అందించేందుకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఈ పథకం రూపొందించినట్లు మెప్మా అధికారులు తెలిపారు.

డ్వాక్రా సంఘంలోని మహిళలు గ్రూపుగా ఏర్పడిన విధంగా.. పురుషులు కూడా కనీసం 5 మందితో గ్రూప్ ఏర్పాటు చేసుకోవచ్చు. గరిష్టంగా ఎంత మందైనా ఈ గ్రూపులో చేరవచ్చు. ఇలా ఒక గ్రూపుగా ఏర్పడిన వారికి మాత్రమే బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. దీనిని వాయిదాల రూపంలో బ్యాంకులకు తిరిగి చెల్లించవచ్చు. ప్రతి ఒక్కరూ కనీసం రూ.100 పొదుపు చేయాల్సి ఉంటుంది.

ఉదాహరణకు ఐదుగురు సభ్యులున్న గ్రూపులో రూ.500 పొదుపుతో మూడు నెలల పాటు క్రమం తప్పకుండా పొదుపు చేస్తే, రివాల్వింగ్ ఫండ్ కింద రూ. 25 వేలు మంజూరు చేస్తారు. వీటిని ఆరు నెలల పాటు క్రమంతో తప్పకుండా పొదుపు చేస్తే, ఫస్ట్ లింకేజీ కింద బ్యాంకులు ఆరు రెట్లు రుణం అందిస్తాయి. రుణాలు అందుకున్న పురుషులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీని మాఫీ చేస్తాయి. వీటికి భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులతో పాటు.. రిక్షా కూలీలు, తోపుడు బండ్లు నడిపే వారు, గిగ్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, కేర్‌ వర్కర్స్‌ అర్హులుగా ఉంటారు.

శ్రీనివాస్ గంగం

రచయిత గురించిశ్రీనివాస్ గంగంశ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh: మోసగాళ్లకే మోసగాళ్లు.. వీళ్ల స్కెచ్ మామూలుగా లేదుగా.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

18 May 2026

సైకిల్, ఈవీలపై కలెక్టర్లు.. బస్సులో జాయింట్‌ కలెక్టర్‌.. శెభాష్!

18 May 2026

Chandrababu Balineni Srinivasa Reddy Meeting,ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. చంద్రబాబుతో బాలినేని భేటీ.. – janasena leader balineni srinivasa reddy meets cm chandrababu naidu

18 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

టాప్ హీరోయిన్లకు టెన్షన్ పెడుతున్న కొత్త బ్యూటీస్.. స్టార్ స్టేటస్ కోసం గట్టి పోటీ

18 May 2026

ఎంతసేపూ టాప్ హీరోయిన్లేనా.. మా గురించి కూడా అప్పుడప్పుడూ ఆలోచించండి.. మేం కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నామంటూ గుర్తు చేస్తున్నారు…

Vastu Tips: ఏ దిశలో కూర్చుని భోజనం చేస్తే అదృష్టం మీ వెంట నడుస్తుందో తెలుసా?

18 May 2026

Varanasi: మార్పుల్లేవు.. వారణాసిలో అది ఫిక్స్..! ఎలా ముగిస్తారోనని ఫ్యాన్స్ టెన్షన్

18 May 2026

Ram Charan : అలాంటి అమ్మాయిని నా జీవితంలోనే చూడలేదు.. ఆ హీరోయిన్ పై రామ్ పొగడ్తలు.. ఇంతకీ ఎవరంటే..

18 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

టాప్ హీరోయిన్లకు టెన్షన్ పెడుతున్న కొత్త బ్యూటీస్.. స్టార్ స్టేటస్ కోసం గట్టి పోటీ

18 May 2026

Vastu Tips: ఏ దిశలో కూర్చుని భోజనం చేస్తే అదృష్టం మీ వెంట నడుస్తుందో తెలుసా?

18 May 2026

Varanasi: మార్పుల్లేవు.. వారణాసిలో అది ఫిక్స్..! ఎలా ముగిస్తారోనని ఫ్యాన్స్ టెన్షన్

18 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025518

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025477

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.