భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎక్కువగా కెనడాను ఎంచుకుంటారు. భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం కెనడాలో 4.27 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. సవరించిన నిబంధనలు కెనడా ఇమిగ్రేషన్ బోర్డర్ అధికారులకు మరిన్ని అధికారాలు కల్పించాయి. వీరు ఈటీఏఎస్, టీఆర్‌వీఎస్, వర్క్ పర్మిట్లు, స్టడీ పర్మిట్లను ప్రత్యేక పరిస్థితుల్లో రద్దు చేయవచ్చు. అంటే, తప్పుడు సమాచారం ఇచ్చారని, క్రిమినల్ రికార్డు ఉందని, లేదంటే గడువు ముగిసిన తర్వాత వారు కెనడా విడిచి వెళతారన్న నమ్మకం లేనప్పుడు.. సరిహద్దు అధికారులు వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు. కెనడా తాజా నిర్ణయంతో దాదాపు 7 వేల అదనపు తాత్కాలిక రెసిడెంట్ వీసాలు వర్క్ పర్మిట్లు, స్టడీ పర్మిట్లు రద్దయ్యే అవకాశం ఉంది. విదేశీయులు, ముఖ్యంగా భారతీయుల పర్మిట్లు రద్దయితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే, కెనడా పోర్టుల నుంచి దేశంలోకి ప్రవేశించకుండా వారిపై నిషేధం విధించవచ్చు. లేదా వారు కెనడాను విడిచి వెళ్లాల్సి రావచ్చు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రధాని మోదీ తీసుకునే సూపర్ ఫుడ్ ఇదే.. లాభాలు తెలిస్తే షాకవుతారు!
చివరి అమృత్‌స్నాన్.. ప్రయాగ్‌రాజ్‌కు కోటి మందికి పైగా.. వీడియో!
ఫంక్షన్ హాల్లో కాదు పంట పొలంలో పెళ్లి.. కారణమేంటంటే.. వీడియో
ఆ గ్రహశకలంతో భూమికి తప్పిన ముప్పు.. ఏం జరిగిందంటే..!వీడియో

