Rohit Sharma Unbreakable Records: అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు ఉన్నాయి. వీటిని బద్దలు కొట్టడం అసాధ్యం. ఇలాంటి లిస్టులో టీమిండియా క్రికెటర్ల రికార్డులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 5 రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి బ్రేక్ చేయాలంటే మాత్రం చాలా కష్టం.. అదేంటో ఓసారి లక్ వేద్దాం రండి..
వన్డేల్లో అత్యధిక స్కోర్..
2014లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఎవరూ ఊహించని రీతిలో రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 264 పరుగులు చేయడం ద్వారా వన్డే ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతని రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యం అనిపిస్తుంది.
డబుల్ సెంచరీల రికార్డ్..
రోహిత్ శర్మ ఎంత గొప్ప వన్డే బ్యాట్స్‌మెన్ అనేది ఈ రికార్డును బట్టి అంచనా వేయవచ్చు. చాలా మంది బ్యాట్స్‌మెన్‌లు తమ మొత్తం ODI కెరీర్‌లో ఒక్క డబుల్ సెంచరీ కూడా సాధించలేకపోయినప్పటికీ, రోహిత్ ఒక్కడే మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. హిట్‌మ్యాన్ 208, 209, 264 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు.
600లకు పైగా సిక్స్‌లు..
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు 620 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటి వరకు మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా 600లను తాకలేకపోయారు.
ఒకే ప్రపంచకప్‌లో 5 సెంచరీలు..
ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 2019లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ 5 సెంచరీలు సాధించాడు. ఈ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా.. ముందెవరూ కూడా సమం చేయలేకుండా సెట్ చేశాడు.
200లు దాటిన టీ20 సిక్స్‌లు..
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. T20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన ఈ వెటరన్ బ్యాట్స్‌మెన్ 205 సిక్సర్లు కొట్టాడు. ఇవి కాకుండా ప్రపంచంలో మరే ఇతర బ్యాట్స్‌మెన్ ఈ ఫార్మాట్‌లో 200 సిక్సర్లు కూడా పూర్తి చేయలేకపోయాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..