Babar Azam: బంగ్లాదేశ్‌తో బుధవారం అంటే నేటి నుంచి ప్రారంభమైన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ మాజీ టెస్టు కెప్టెన్ బాబర్ అజామ్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో టెస్ట్ ఫార్మాట్‌లో తొలిసారిగా స్వదేశంలో జీరోకే ఔటైన రికార్డును బాబర్ తన ఖాతాలో వేసున్నాడు. నాలుగో నంబర్‌లో క్రీజులోకి వచ్చిన బాబర్ తొమ్మిదో ఓవర్‌లో షోరీఫుల్ ఇస్లాంకు బలయ్యాడు. కెప్టెన్ షాన్ మసూద్ వివాదాస్పద వికెట్ తర్వాత మైదానంలోకి వచ్చిన బాబర్ తొమ్మిదో ఓవర్ రెండో బంతికి వికెట్ కీపర్ లిటన్ దాస్ అద్భుత క్యాచ్ పట్టడంతో పెవిలియన్ వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. బాబర్ కేవలం 2 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.
అభిమానుల అంచనాలు తలకిందులు..
విశేషమేమిటంటే.. దాదాపు 20 నెలల తర్వాత బాబర్ ఆజం స్వదేశంలో టెస్టు ఆడుతున్నాడు. వాస్తవానికి, పాకిస్తాన్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను జనవరి 2023లో స్వదేశంలో ఆడింది. ఆ ద్వారా దాదాపు 20 నెలల తర్వాత బాబర్ తిరిగి మైదానంలోకి వచ్చినా అభిమానుల అంచనాలకు అనుగుణంగా బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. విశేషమేమిటంటే, మూడేళ్లలో టెస్టు క్రికెట్‌లో బాబర్ సున్నాకి ఔట్ కావడం ఇదే తొలిసారి.
సూపర్ మ్యాన్ క్యాచ్..
Babar Azam gone for a two ball duck.#PAKvBAN pic.twitter.com/xDEe9nkGNQ
— 𝙎𝙝𝙚𝙧𝙞 (@CallMeSheri1) August 21, 2024
నిజానికి ఈ మ్యాచ్‌కు ముందు షోరీఫుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ‘నేను బాబర్ అజామ్ వికెట్ తీయాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు. అతని కోరిక మేరకు, లిటన్ దాస్ అద్భుతమైన క్యాచ్‌తో షోరిఫుల్ ఇస్లాం తన కోరికను నెరవేర్చుకున్నాడు. షోరీఫుల్, లెగ్ స్టంప్ వెలుపల బంతిని వేశాడు. వెంటనే బాబర్ వికెట్ వెనుక బంతిని బౌండరీకి కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, వికెట్ వెనుక నిలబడిన లిటన్ ఎడమవైపు అద్భుతంగా డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ పట్టాడు.
రికార్డ్ బ్రేక్ చేసే అవకాశాన్ని కోల్పోయిన బాబర్..
ఈ మ్యాచ్‌లో బాబర్ అజామ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి, అంటే 104 పరుగులు చేసి ఉంటే, ప్రపంచంలోనే అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించే అవకాశం ఉండేది. కానీ బాబర్ తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవలేకపోయాడు. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో బాబర్ 104 పరుగులు చేస్తే ఈ రికార్డు అతని ఖాతాలో చేరిపోతుంది. బాబర్ ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో 52 మ్యాచ్‌లు ఆడి 94 ఇన్నింగ్స్‌లలో 3898 పరుగులు చేశాడు. బాబర్ 102 పరుగులు చేస్తే 4000 పరుగుల మార్క్ పూర్తి చేస్తాడు. కాబట్టి, బాబర్ తర్వాతి ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అధిగమిస్తాడో లేదో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..