Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Krish Jagarlamudi: ఆ సినిమా చేస్తూ చాలా బాధపడ్డాను.. కార్‏లో కూర్చొని ఏడ్చాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..

11 February 2026

Andhra Crime: అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే..

11 February 2026

అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా

11 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»మహారాజ భవనమా…? మైసూర్ పేలస్సా..? ఆ ఇంటి చుట్టూనే దువ్వాడ ఫ్యామెలీ డ్రామా ఎందుకు తిరుగుతోంది?
తాజా వార్తలు

మహారాజ భవనమా…? మైసూర్ పేలస్సా..? ఆ ఇంటి చుట్టూనే దువ్వాడ ఫ్యామెలీ డ్రామా ఎందుకు తిరుగుతోంది?

.By .22 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
మహారాజ భవనమా…? మైసూర్ పేలస్సా..? ఆ ఇంటి చుట్టూనే దువ్వాడ ఫ్యామెలీ డ్రామా ఎందుకు తిరుగుతోంది?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


వార్తల కోసం వాచిపోతున్న మీడియాకు… బాగా ఆకలి మీదున్న వ్యక్తికి బిర్యాని దొరికినట్టు… ఎక్కడో సిక్కోలు జిల్లాలో ఒడిషా బోర్డర్‌కు దగ్గర్లో ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ గెలుపు ముఖం చూడని… పార్టీని నమ్ముకున్నందుకు ఎమ్మెల్సీ హోదాలో ఉన్న ఓ వీఐపీ ఫ్యామెలీ ఎపిసోడ్ దొరికేసింది. అంతే… మొత్తం తెలుగు మీడియా అంతా అక్కడే వాలిపోయింది. ఒకప్పుడైతే.. కేవలం టీవీ ఛానెళ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటికి పోటీగా యూట్యూబ్ ఛానెళ్లొచ్చాక… పాపం దువ్వాడ వారి కుటుంబ కథా చిత్రం ప్రతి ఇంట్లో ఓ కార్తీక దీపం సీరియల్ రేంజ్ ఇమేజ్ తెచ్చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే ఆ ఫ్యామెలీ మెంబర్లంతా పోటా పోటీగా మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. తిట్టుకుంటూ… లైవ్‌ల మీద లైవ్‌ అడిగిన ఛానెళ్లకు.. అడగని ఛానెళ్లకు.. పిలిచి మరీ ఇస్తూ ఉండేసరికి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనం టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు.

ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో ట్విస్ట్

మొదట భార్యా భర్త పంచాయితీ అనుకున్నారు. ఆ తర్వాత మాధురి ఎంట్రీతో…పతి పత్ని ఔర్‌ ఓ అనుకున్నారు. సీరియల్ ముదురు పాకాన పడ్డాక.. ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కో ట్విస్ట్ మొదలైంది. ఆ తర్వాత భార్య వాణి, తన కుమార్తెతో కలిసి ఏకంగా దువ్వాడ శ్రీను ఇంటి ముందే కారు షెడ్లో నిరసన పేరుతో రోజుల తరబడి అక్కడే ఉన్నారు. తన భర్తను .. మాధురి అనే మహిళ తమకు కాకుండా చేస్తోందని.. ఆస్తుల కోసం తమ కుటుంబంలో చిచ్చుపెడుతోందని వాణి , ఆమె కుమార్తె హైందవి ఆరోపిస్తే… తనను 2 ఏళ్లుగా ఏ మాత్రం పట్టించుకోలేదని, తన ఆస్తి కోసమే దువ్వాడ వాణి తనపై ఆరోపణలు చేస్తోందని ఎమ్మెల్సీ శ్రీనివాస్ ప్రత్యారోపణలు చేశారు. ఇక మాధురి తనపై వచ్చిన ఆరోపణల్ని, తాను దువ్వాడ శ్రీనివాస్‌ విషయంలో వ్యవహరిస్తున్న తీరు గురించి.. చెప్పిన విషయాలను ఇప్పుడు మళ్లీ మళ్లీ ప్రస్తావించదల్చుకోలేదు. అవి అందరికీ తెలిసినవే. ఇక ఆ ఫ్యామెలీ రచ్చ వీధికెక్కిన తర్వాత కుటుంబ సభ్యులు ఎంటర్ కావడం… వాళ్లూ ఎటూ తేల్చకపోవడం.. ఆపై దువ్వాడ శ్రీను తన భార్య వాణికి విడాకుల నోటీసులు పంపడం… ఇలా గత కొద్ది రోజులుగా చాలా చాలా మలుపులు తిరిగింది ఈ స్టోరీ. చివరకు అటు తిరిగి.. ఇటు తిరిగి దువ్వాడ శ్రీను ప్రస్తుతం ఉంటున్న ఇంటి దగ్గరకు వచ్చింది. ఆ ఇల్లే తనకు కావాలంటున్నారు వాణి. మొదట్లో తనను ఇంట్లోకి రానిస్తే చాలన్న వాణి… ఆ ఇంటి స్థలం తన డబ్బుతోనే దువ్వాడ కొన్నారన్నారు. అసలు దువ్వాడకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? వాళ్ల అమ్మానాన్నా ఆస్తులు ఇచ్చారా? ఒక ఎకరా భూమి అయినా ఉందా? అంతా తనవే అంటున్నారు వాణి. ఇల్లు తన తల్లిపేరు మీదే ఉందని, ఇన్‌కంట్యాక్స్‌ కోసం దువ్వాడ పేరు మీద పెట్టామన్నారు.”ఒక్క రూపాయి కూడా లేనప్పుడు ఆయన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.పదవులు, ఆస్తులు మా వల్ల ఆయనకు వచ్చాయి. మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం మాది. నేను జెడ్పీటీసీగా చేశా. ఆయన కోసం నేను త్యాగం చేశానా..? నా కోసం ఆయన త్యాగం చేశారా ?” అన్నది వాణీ వాదన.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

అయితే ఇప్పటికే తన ఆస్తులన్నీ వారికి రాసిచ్చానని, ఇక తన దగ్గర ఇంకేం లేదని ఆ ఇంటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాసివ్వనన్నది దువ్వాడ వాదన.

ఇలా భార్య-భర్తలిద్దరూ ఇంటికోసం కొట్లాడుతుండగానే… మధ్యలో ఆ స్థలం తనదని.. తనకు ఇంకా స్థలానికి చెల్లించాల్సిన మొత్తం బాకీ ఉంటుండగానే మీరు దాని కోసం గొడవ పడతారా అంటూ మధ్యలోకొచ్చారు పార్వతీశం మాస్టారు. తనకు ఇంకా 60 లక్షలు బాకీ ఉన్నారని గతంలో తనకు దువ్వాడ ఇచ్చిన చెక్కులు కూడా చూపించారు. నా సైట్‌ కోసం మీరు గొడవ పడతారా…అంటూ దువ్వాడ శ్రీనివాస్, వాణి ఇద్దరిపైనా ఆగ్తహం వ్యక్తం చేశారు. తనకు డబ్బు ఎవరు ఇస్తారన్నది ఆయన ఆవేదన.  “ఈ పరిస్థితి చూసిన తర్వాత ఆ స్థలాన్ని ఎందుకిచ్చానా అని బాధపడుతున్నా.. ఇప్పటికైనా ఎవరింట్లో వాళ్లుంటూ నాకివ్వ వలసిన డబ్బులు ఎవరు ఇస్తారో తేల్చాలి. ఆ డబ్బుల్ని వాణి ఇస్తారా..? శ్రీను ఇస్తారా..? తేల్చాలి. వాణీకి ఇవ్వాలనుకుంటే మొత్తం డబ్బులు ఇవ్వాలకదా..లేదంటే నాకు ఇవ్వాల్సిన మొత్తం నాకు ఇచ్చేసి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతే మంచిదే.” అని పార్వతీశం టీవీ9తో చెప్పారు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

)

అక్కడితో ఆ ఇంటి కథ కొలిక్కి రాలేదు.
“ఆ ఇంటి నిర్మాణానికి తాను దువ్వాడ శ్రీనుకు 2 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చానంటూ.. ఆ మేరకు ఆయన ఇచ్చిన చెక్కులు తన దగ్గర ఉన్నాయంటూ వాటిని మీడియాకు చూపిస్తూ ఈ సూపర్ డూపర్ ఫ్యామెలీ స్టోరీలో మాధురి మరో ట్విస్ట్ ఇచ్చారు. సో.. 2 కోట్లు ఇచ్చారు కనుక.. తనకు కూడా ఆ ఇంటిమీద హక్కు ఉందంటూ తన వాదన తాను మొదలుపెట్టారు. అదే ఇల్లు కావాలంటే..వాణి తనకు ఆ డబ్బుఇవ్వాలంటున్నారు మాధురి. తనకు డబ్బు ఇచ్చేదాకా దువ్వాడ ఇంటి దగ్గర బైఠాయిస్తానంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె చెప్పిన మాటల్ని ఓ సారి చూస్తే… ” శ్రీనివాస్ నా దగ్గరు 2 కోట్లు తీసుకున్నారు. ఎప్పుడైనా తన దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేస్తానని చెప్పారు. అందులో బాగంగా 50 లక్షలు చొప్పున్న నాకు నాలుగు చెక్కులు కూడా ఇచ్చారు. అయితే ఇలా చూపించడానికి నేనేదో ఆయనకు డబ్బులిచ్చానని చెప్పడానికి కాదు, ఇప్పుడు వాణీ ఆమెకు ఆ ఇల్లు కావాలని, ఆమెకు మాత్రమే ఆ ఇంటిపై హక్కు ఉందని మాట్లాడుతున్నందునే ఇప్పుడు ఇలా ఈ చెక్కుల్ని చూపిస్తున్నాను. నాకు ఆ 2 కోట్లు ఇచ్చేసి ఆ ఇంటిని వాణీ తీసుకుంటారా..? లేదా వాణీ తన ఇంటికి తాను వెళ్లి శ్రీనివాస్ గారితో చట్టపరంగా తేల్చుకుంటారా ప్రజలే డిసైడ్ చెయ్యాలి” ఇది మాధురి వాదన.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

ఆ ఇల్లు ఏమైనా మైసూర్ ప్యాలెస్సా?

సో.. మొత్తంగా ఇప్పుడు దువ్వాడ ఎపిసోడ్.. అటు తిరిగి.. ఇటు తిరిగి… దువ్వాడ ఇంటి దగ్గరకు వచ్చి ఆగింది. ఇంత మంది అంతగా పాకులాడుతున్న ఆ ఇల్లు ఏమైనా రాజభవమనమా..? అసలు ఎందుకు దువ్వాడ శ్రీనివాస్‌ ప్యాలెస్‌ కోసం ఎందుకింత పంచాయితీ?

ఈ ఇంటి కోసమే ఇప్పుడు గొడవంతా!

ఈ ఇంటి కోసమే ఇప్పుడు గొడవంతా!

అసలు ఆ ఇంటి విలువెంత..? 
టెక్కలి లోని దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటి కోసం ఎందుకింత రచ్చ జరుగుతోంది. అదేమైనా మైసూర్‌ ప్యాలెస్సా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు జనం. దువ్వాడ ఇల్లు మొత్తం 24 సెంట్ల స్థలంలో ఉంది. అంటే పావు ఎకరం స్థలం. 1.5 కోట్ల రూపాయలు పెట్టి స్థలం కొని, 2 కోట్ల రూపాయల ఖర్చుతో 20 సెంట్లలో దువ్వాడ శ్రీనివాస్‌ ఇల్లు కట్టారని స్థానికులు చెబుతున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు పైన 2 అంతస్తులు వేశారు. అయితే రెండో అంతస్తులో శ్లాబ్‌ వేసి వదిలేశారు. దాని విలువ ఇప్పటి రేట్ల ప్రకారం సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుందంటున్నారు స్థానికులు. ఈ ఇంటి కోసం ఎందుకింత ఫైటింగ్‌ జరుగుతోందో లోకల్స్‌కు కూడా అంతుబట్టడం లేదట. ఇంతకీ ఇంటి కోసమే గొడవ జరుగుతోందా? ఇంటి గుట్టు వేరే ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా ఇలా జరుగుతుండగానే తాజాగా దువ్వాడ మంగళవారంనాడు ఆ ఇంటిని క్యాంప్ కార్యాలయంగా మార్చేశారు. వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం, ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్ పేరుతో ఇంటి ప్రధాన గేటు దగ్గర బ్యానర్లను ఏర్పాటు చేశారు.

దువ్వాడ శ్రీనివాస్‌పై గృహ హింస కేసు

మరోవైపు దువ్వాడపై గృహ హింస కేసు పెట్టారు వాణి. అటు దువ్వాడ ఇప్పటికే ఆమెకు విడాకుల నోటీసులు కూడా ఇచ్చారు. ఆమెతో వైవాహిక బంధం విషయంలో మరో మాట లేనే లేదనన్నారు. మొత్తంగా ఇప్పటికి ఈ ఫ్యామెలీ డ్రామా 2 వారాలుగా నడుస్తోంది. ఇప్పటికీ కొలిక్కి రాలేదు సరికదా.. రోజుకో సరికొత్త ట్విస్టుతో సినిమా స్టోరీని మించిపోతోంది.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Krish Jagarlamudi: ఆ సినిమా చేస్తూ చాలా బాధపడ్డాను.. కార్‏లో కూర్చొని ఏడ్చాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..

11 February 2026

అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా

11 February 2026

Socrates Quotes: భార్యతో గొడవలే ఆయన్ని మహాజ్ఞానిని చేశాయా! పెళ్లి గురించి సోక్రటీస్ ఏం చెప్పాడో తెలుసా?

11 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Krish Jagarlamudi: ఆ సినిమా చేస్తూ చాలా బాధపడ్డాను.. కార్‏లో కూర్చొని ఏడ్చాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..

11 February 2026

దర్శకుడు క్రిష్ జాగర్లముడి ఓ ఇంటర్వ్యూలో తన చలనచిత్ర ప్రయాణంలో ఎదురైన అనేక అనుభవాలను, వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకున్నారు. గమ్యం…

Andhra Crime: అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే..

11 February 2026

అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా

11 February 2026

Socrates Quotes: భార్యతో గొడవలే ఆయన్ని మహాజ్ఞానిని చేశాయా! పెళ్లి గురించి సోక్రటీస్ ఏం చెప్పాడో తెలుసా?

11 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Krish Jagarlamudi: ఆ సినిమా చేస్తూ చాలా బాధపడ్డాను.. కార్‏లో కూర్చొని ఏడ్చాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..

11 February 2026

Andhra Crime: అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే..

11 February 2026

అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా

11 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.