సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. నిత్యం హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఓ చిన్నారి ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమ్స్ హీరోయిన్ .
మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సీ పన్ను.. 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మందినాదం సినిమాలో హీరోయిన్ గా చేసింది.
2011లో వేటిమారన్ దర్శకత్వం వహించిన ధనుష్ చిత్రం ఆడుకలంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. అలాగే 2013లో వరుణ్ ధావన్ షష్మే బాదూర్ చిత్రంలో నటించడం ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.
తెలుగులో వరుసగా సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది ఈ అమ్మడు. అక్కడ తాప్సీ.. బేబీ, పింక్, ది ఘాజీ అటాక్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక నటిగా నిరూపించుకుంది.
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న తాప్సీ పన్ను ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లోనూ నటిస్తోంది. తాప్సీ పన్ను తన అద్భుతమైన నటనకు రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అలాగే ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది.