2025 సంక్రాంతి మరోసారి బిగ్ క్లాష్‌కు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి ఇద్దరు టాప్ స్టార్స్ ఈ సీజన్‌లో బరిలో దిగబోతున్నారు. దీంతో ఇప్పటి నుంచే సంక్రాంతి వార్ మీద ఫోకస్ చేస్తున్నారు సౌత్ ఆడియన్స్.
2025 సంక్రాంతి సీజన్ మీద అందరి కంటే ముందే కర్చీఫ్ వేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రజెంట్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరు, ఆ సినిమాను సంక్రాంతి రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. చాలా రోజుల తరువాత చిరు ఫాంటసీ మూవీ చేస్తుండటంతో విశ్వంభర మీద భారీ అంచనాలు ఉన్నాయి.
చిరుతో ఢీ అనేందుకు రెడీ అవుతున్నారు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ అక్టోబర్‌లో వేట్టయన్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న రజనీ, ఆ తరువాత షార్ట్ గ్యాప్‌లోనే కూలీ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
రీసెంట్ టైమ్స్‌లో చిరు భోళాశంకర్, రజనీ జైలర్ సినిమాలు ఒకే సీజన్‌లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండిట్లో జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా భోళా శంకర్ నిరాశపరిచింది. దీంతో మరోసారి ఈ ఇద్దరు హీరోలు ఒకే సీజన్‌లో పోటి పడుతుండటంతో సక్సెస్ ఎవర్ని వరిస్తుందా అన్నది ఆసక్తి కరంగా మారింది.
విశ్వంభర, కూలీ రెండు పాన్ ఇండియా సినిమాలే. చిరు, రజనీ ఇద్దరు తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలే. అందుకే ఈ క్లాష్ గురించి ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. పొంగల్ సీజన్లో రెండు భారీ సినిమాలకు స్కోప్ ఉంటుంది కాబట్టి, ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.






