Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆ గ్రామంలో 70 ఏళ్ల తర్వాత పంచాయతీ పోరు.. తొలిసారి ఓటేస్తున్న ప్రజలు.. ఎక్కడంటే?

17 December 2025

Telangana: శ్మశానంలో సగం కాలిన శవం.. దాని పక్కనే వింత ఆకారాలు.. ఏంటని పరిశీలించగా

17 December 2025

Banana Flower: ఆ సమస్యతో నరకం చూస్తున్నారా? అరటిపువ్వుతో అద్భుతైన పరిష్కారం!

17 December 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh: లక్ అంటే ఇదే..! ఒక్క రాయితో డ్రైవర్ పంట పండింది.. దాని విలువ ఎంతో తెలుసా?
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh: లక్ అంటే ఇదే..! ఒక్క రాయితో డ్రైవర్ పంట పండింది.. దాని విలువ ఎంతో తెలుసా?

.By .24 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh: లక్ అంటే ఇదే..! ఒక్క రాయితో డ్రైవర్ పంట పండింది.. దాని విలువ ఎంతో తెలుసా?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది.. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వజ్రాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. సాధారణంగా తొలకరి వర్షాలు పడితే.. వ్యవసాయం కోసం పొలం దున్ని.. విత్తనాలు వేయడానికి రైతన్నలు రెడీ అవుతారు. కానీ.. ఆ ప్రాంతాల్లో మాత్రం.. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతారు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. పలుగు, పార చేతపట్టి అందరూ పొలం బాట పడతారు. అయితే.. వ్యవసాయం చేయడానికి మాత్రం కాదు. కోటీశ్వరులు అయ్యేందుకు ఆ నేలలో అన్వేషిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ డ్రైవన్ పంట పండింది.

మట్టిలో దాగున్న అదృష్టపు మొలకల కోసం వెతుకుతుండగా, లక్ష్మీ దేవి తలుపు తట్టింది. డ్రైవర్ జీవితం రాత్రికి రాత్రి మారిపోయింది. స్వయాన రైతు అయిన డ్రైవర్.. జీవన కష్టాల నుంచి గట్టెక్కి రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. అతని జీవితం ధన్యమైంది. ఇలా దొరికిన వజ్రాన్ని ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. ఇందుకు గానూ 12 లక్షల రూపాయలు నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారి.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన బోయ రామాంజనేయులు అనే రైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. బోయ రామాంజనేయులు, బోయ. శేఖర్లు అన్నదమ్ములు. ఇద్దరు తమకున్న రెండు ఎకరాల పొలంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పొలంలో పనులు లేనప్పుడు డ్రైవర్లుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం పొలం పనులకు వెళ్లిన బోయ. రామాంజనేయులుకు ఓ రాయి దొరికింది. దొరికిన రాయిని జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారికి చూపించాడు. ఇది వజ్రం అని తేల్చి 12 లక్షల రూపాయలు నగదు, 5తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు.

చిన్నప్పటి నుండి కష్టాలు పడుతూ జీవనం సాగిస్తున్న తమకు వజ్రం దొరకడంతో తమ కష్టాలు తీరిపోయాయని బోయ రామాంజనేయులు అన్నారు. ఇలా ఒక్కరోజులోనే నగదు, బంగారం తమ ఇంటికి రావడంతో ఒక్క రోజుల్లోనే లక్షాధికారి అయిన రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాలు రావడంతో దాదాపుగా ఇప్పటి వరకు 42 వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం. వారానికి 4 నుండి 8 చొప్పున వజ్రాలు దొరుకుతుండడం విశేషం.

కర్నూలు జిల్లాలోని తుగ్గలి, మద్దికేర ,పెరవలి, పగిడిరాయి, జొన్నగిరి, ఎర్రగుడి, వంటి ప్రాంతాలలో వజ్రాల అన్వేషణ కొనసాగుతూ ఉంటుంది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, బొంబాయి, వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. దొరికిన వజ్రాలను గుత్తి, జొన్నగిరి, పెరవలి, గ్రామాలకు చెందిన వజ్రాల వ్యాపారస్తులకు అమ్మి డబ్బులు తీసుకెళ్తున్నారు. అయితే దొరికిన వజ్రాలు ఎంత విలువ చేస్తాయో వజ్రాలు దొరికిన వారికి అవగాహన లేకపోవడంతో వజ్రాల వ్యాపారస్తులు ప్రజలను మోసం చేస్తూ ఎక్కువ విలువ చేసే వజ్రాలు తక్కువగా కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఒకే ఒక్క వజ్రం దొరికితే తమ రాతలు మారిపోతాయని స్థానికులు ఆశపడుతున్నారు. చాలా మంది జొన్నగిరి ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Cricketer Sri Charani Rs 2.5 Crore Cheque,టీమిండియా క్రికెటర్‌కు రూ.2.5 కోట్లు చెక్.. స్వయంగా అందజేసిన మంత్రి నారా లోకేష్ – ap minister nara lokesh handed over rs 2 crore 50 lakhs cheque to indian woman cricketer sri charani

17 December 2025

Andhra: దొంగలించిన సొమ్ము రికవరీ చేసి వెంటనే బాధితుడికి ఇచ్చేయొచ్చు.. ఏలూరు పోలీసులు చేసిన పనికి

17 December 2025

Sricharani: శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. రూ. 2.5 కోట్ల చెక్‌తోపాటు ఉద్యోగం..

17 December 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

ఆ గ్రామంలో 70 ఏళ్ల తర్వాత పంచాయతీ పోరు.. తొలిసారి ఓటేస్తున్న ప్రజలు.. ఎక్కడంటే?

17 December 2025

ఆదిలాబాద్ జిల్లాలోని ఆ గ్రామంలో ఏడు దశాబ్దాలుగా అసలు సర్పంచ్ ఎన్నికల ముచ్చటే లేదు. పంచాయితీ ఎన్నికల్లో ఆ ఊరు…

Telangana: శ్మశానంలో సగం కాలిన శవం.. దాని పక్కనే వింత ఆకారాలు.. ఏంటని పరిశీలించగా

17 December 2025

Banana Flower: ఆ సమస్యతో నరకం చూస్తున్నారా? అరటిపువ్వుతో అద్భుతైన పరిష్కారం!

17 December 2025

Indian Currency: పాత రూ.500, రూ.వెయ్యి నోట్లు మీ దగ్గర ఉన్నాయా..? మీకో అలర్ట్.. భారీగా జరిమానా..

17 December 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఆ గ్రామంలో 70 ఏళ్ల తర్వాత పంచాయతీ పోరు.. తొలిసారి ఓటేస్తున్న ప్రజలు.. ఎక్కడంటే?

17 December 2025

Telangana: శ్మశానంలో సగం కాలిన శవం.. దాని పక్కనే వింత ఆకారాలు.. ఏంటని పరిశీలించగా

17 December 2025

Banana Flower: ఆ సమస్యతో నరకం చూస్తున్నారా? అరటిపువ్వుతో అద్భుతైన పరిష్కారం!

17 December 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025145
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.