ప్రస్తుతం EPFO సుమారు 30 కోట్లకు పైగా సభ్యుల నిధులను నిర్వహిస్తూ, దాదాపు రూ.31 లక్షల కోట్ల ఫండ్‌ను చూసుకుంటోంది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈక్విటీ మార్కెట్‌లు, ETFల్లో పెట్టుబడులను పెంచాలా అనే అంశంపై విస్తృతంగా చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ పెట్టుబడుల ద్వారా అధిక ఆదాయం సాధ్యమైతే, సభ్యుల ఖాతాల్లో వడ్డీతో పాటు అదనపు లాభం జమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

