హీరోయిన్ క్యాథరిన్ ట్రెసా. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయి. ఇద్దరమ్మాయిలు, సరైనోడు, బింబిసార వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వరుణ్ సందేశ్ నటించిన చమ్మక్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.
ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమాలో మెరిసింది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీకి మాత్రం క్రేజ్ రాలేదు. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాతో హిట్ అందుకుంది.
ఆతర్వాత మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించినా బింబిసార సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాలు వరుసగా హిట్ అవుతున్నప్పటికీ ఈ చిన్నదానికి అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు.
గత రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది క్యాథరిన్. చివరగా 2022లో రిలీజ్ అయిన నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రంలో కనిపించింది. ఇటీవలే తనకు ఉన్న ఓ వింత జబ్బును బయట పెట్టి వార్తల్లో నిలిచింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.