పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య నెల కొన్న ఉద్రిక్త పరిస్ధితులతో భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు. దీంతో రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని సరిహద్దు ప్రాంతమైన బనస్కాంత జిల్లాలో ఓ పాకిస్తాన్ జాతీయులు భారత్‌లోకే చొరబడేందుకు యత్నించాడు. సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన కంచెను దాటి దేశంతోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన బీఎస్‌ఎఫ్ దళాలు అప్రమత్తమైన అతన్ని అక్కడే ఆగిపోవాలని హెచ్చరించారు. అయినా వినకుండా ఆ వ్యక్తి ముందుకు రావడానికి ప్రయత్నించాడు. దీంతో, ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా బీఎస్‌ఎఫ్ జవాన్లు అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని భద్రతా దళాలు ఓ ప్రకటన ద్వారా తెలియజేశాయి.
ఇక భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అంతా సద్దుమణిగిందనుకున్న సమయంలో ఇలాంటి చొరబాటు యత్నాలు జరుగుతుండడంతో భారత్ బగాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసి నిత్యం నిఘా పెడుతున్నాయి.
BSF troops neutralised a Pakistani intruder attempting to enter Indian territory in Banaskantha district, Gujarat, on May 23 during night. BSF troops spotted one suspicious person advancing towards the border fence after crossing the International Border. They challenged the… pic.twitter.com/qQu8pXsaZj
— ANI (@ANI) May 24, 2025
- ఇది కూడా చదవండి..
ఇదిలా ఉండగా గుజరాత్‌లో మరో ISI ఏజెంట్ అరెస్ట్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతను హెల్త్ వర్కర్‌గా పనిచేస్తూ పాకిస్తాన్‌కు ఆర్మీ , ఎయిర్‌ఫోర్స్ సమాచారం చేరవేస్తునట్టు పోలీసులు గుర్తించారు. దీంతో సహదేవ్‌సంగ్‌ను కచ్‌లో అదుపు లోకి తీసుకున్నారు. అతని వాట్సాప్ చాట్స్‌తో ఫోటోలను షేర్ చేస్తునట్టు గుర్తించారు. ఆదిల్ అనే మారుపేరుతో పాకిస్తాన్ ఏజెంట్‌గా పనిచేస్తునట్టు గుర్తించారు. నిందితుడి ఫోన్‌ను ఫోరెన్సిక్ విచారణ కోసం పంపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.