Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Team India: ఈ 3 దాటితేనే సూర్యసేన ట్రోఫీని ముద్దాడేది.. రిపీటైతే మరో ఘోర పరాభవం తప్పదంతే?

3 March 2026

Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఉన్నట్లుండి ఒక్కసారిగా పతనం.. ఇవాల్టీ రేట్లు ఇవే..

3 March 2026

Nellore Man Bring Snake To Hospital,పామును తీసుకుని ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. చనిపోతానేమోనన్న భయంతో, వీడియో వైరల్ – nellore man carries snake to hospital after bite in nellore district

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Panchayat Elections 2024: త్వరలోనే ‘స్థానిక’ ఎన్నికల నగారా.. అమీతుమీకి సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు..
తెలంగాణ

Panchayat Elections 2024: త్వరలోనే ‘స్థానిక’ ఎన్నికల నగారా.. అమీతుమీకి సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు..

.By .1 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Panchayat Elections 2024: త్వరలోనే ‘స్థానిక’ ఎన్నికల నగారా.. అమీతుమీకి సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మారిపోయింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలిపోయింది. తెలంగాణలో ప్రధాన పార్టీలు రెండ్నెల్లలో మరో అగ్నిపరీక్షకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆలస్యమైన స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో భేటీ అయ్యారు ఎస్ఈసీ పార్థసారధి. ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇప్పటికే వార్టుల వారీగా ఓటర్ల జాబితా తయారీ తుది దశకు చేరుకోవడంతో పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు ఆహ్వానించారు. వార్డులవారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల ముసాయిదా జాబితాను సెప్టెంబరు 6న ప్రకటిస్తారు. 7నుంచి 13వ తేదీదాకా ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 21న తుది ఓటర్ల జాబితాను వార్డులవారీగా ప్రకటిస్తారు.

రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసి ఏడు నెలలు గడిచిపోయింది. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల వివరాలు అందిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాబోతోంది. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబరు మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీలు భావిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంకావాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు. ముందుగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు ఉంటాయని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. మొత్తానికి పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కాస్త రిలాక్స్‌ అయిన పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగగానే మళ్లీ ప్రజల్లోకి వెళ్లబోతున్నాయి.

మూడు ప్రధానపార్టీలకు ప్రతిష్టాత్మకం..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు ప్రధానపార్టీలకు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్‌ స్థానిక సంస్థల్లోనూ సత్తా చాటాలనుకుంటోంది. రుణమాఫీ కార్యక్రమంతో పాటు సంక్షేమ పథకాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కలిసొస్తాయన్న ధీమాతో ఉంది అధికారపార్టీ. అధికారంలోకి రాగానే స్థానికసంస్థల్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌.. వచ్చే ఎన్నికలను ఇజ్జత్‌కా సవాల్‌గా భావిస్తోంది. రేవంత్‌రెడ్డి నాయకత్వానికి రెఫరెండంలా మారబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటిన బీఆర్‌ఎస్‌ పట్టు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్‌లో సత్తాచాటిన కారుపార్టీ.. గ్రామీణప్రాంతాల్లోనూ తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాలనుకుంటోంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమిభారాన్ని స్థానిక సంస్థల్లో దించుకోవాలన్న వ్యూహంతో ఉంది బీఆర్‌ఎస్‌.

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బలం పుంజుకున్న బీజేపీకి కూడా స్థానికసంస్థలు సవాలుగా మారబోతున్నాయి. క్షేత్రస్థాయిలోనూ బలం ఉందని నిరూపించుకోవాలంటే స్థానిక సంస్థల్లో కూడా సత్తా చాటాల్సి ఉంటుంది. ఒకరికిద్దరు కేంద్రమంత్రులున్నా పార్టీ రాష్ట్ర సారథిపై నాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలుకావటంతో త్వరగా కొత్త అధ్యక్షుడెవరో తేలిస్తే ఎన్నికలకు సిద్ధంకావచ్చంటోంది ఆ పార్టీ కేడర్‌. మొత్తానికి తొమ్మిదినెలల గ్యాప్‌ తర్వాత మళ్లీ తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలుకాబోతోంది. గల్లీదాకా పార్టీజెండా ఎగిరే ఎన్నికలు కావటంతో మూడు ప్రధానపార్టీలకూ అత్యంత కీలకం కాబోతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Hyderabad: ఓఆర్‌ఆర్‌ వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న కారు.. ఆపి చూడగా గుప్పుమన్న ఘాటు వాసన!

2 March 2026

Telangana: ఐడియా అదుర్స్.. కోతులను అడవి బాట పట్టించేందుకు శాశ్వత పరిష్కారం ఇదిగో! వీడియో

2 March 2026

Bank Jobs 2026: డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర జీతం! ఎలా ఎంపిక చేస్తారంటే..

2 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Team India: ఈ 3 దాటితేనే సూర్యసేన ట్రోఫీని ముద్దాడేది.. రిపీటైతే మరో ఘోర పరాభవం తప్పదంతే?

3 March 2026

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు…

Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఉన్నట్లుండి ఒక్కసారిగా పతనం.. ఇవాల్టీ రేట్లు ఇవే..

3 March 2026

Nellore Man Bring Snake To Hospital,పామును తీసుకుని ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. చనిపోతానేమోనన్న భయంతో, వీడియో వైరల్ – nellore man carries snake to hospital after bite in nellore district

3 March 2026

యుద్ధ సమయంలో ఇలా పెట్టుబడి పెట్టండి.. మంచి లాభాలు చూస్తారు?

3 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Team India: ఈ 3 దాటితేనే సూర్యసేన ట్రోఫీని ముద్దాడేది.. రిపీటైతే మరో ఘోర పరాభవం తప్పదంతే?

3 March 2026

Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఉన్నట్లుండి ఒక్కసారిగా పతనం.. ఇవాల్టీ రేట్లు ఇవే..

3 March 2026

Nellore Man Bring Snake To Hospital,పామును తీసుకుని ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. చనిపోతానేమోనన్న భయంతో, వీడియో వైరల్ – nellore man carries snake to hospital after bite in nellore district

3 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.